ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

The Growing Trend of Baby Name Consultants: పేర్లు పెడుతూ లక్షలు సంపాదించేస్తున్నారు

ABN, Publish Date - Oct 27 , 2025 | 04:56 AM

పిల్లలకు ఏ పేరు పెట్టాలా అని తల్లిదండ్రులు పగలనక రాత్రనక ఆలోచిస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను సలహా అడగడమే కాకుండా నెట్టింట్లో తెగ వెతికేస్తుంటారు. చివరికి ఓ చక్కని పేరును ఎంపిక చేసి...

పిల్లలకు ఏ పేరు పెట్టాలా అని తల్లిదండ్రులు పగలనక రాత్రనక ఆలోచిస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను సలహా అడగడమే కాకుండా నెట్టింట్లో తెగ వెతికేస్తుంటారు. చివరికి ఓ చక్కని పేరును ఎంపిక చేసి సంబరపడిపోతుంటారు. కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు అలా కష్టపడనక్కర్లేదు. పిల్లలకు అందమైన పేర్లు పెట్టడానికి కన్సల్టెంట్లు, బేబీ నేమర్లు వచ్చేశారు. ఈ ట్రెండ్‌ మరీ కొత్తది కానప్పటికీ ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టేలర్‌ అలెగ్జాండ్రా హంప్రీ అనే మహిళ... గత పదేళ్లుగా పిల్లలకు చక్కని పేర్లు సూచిస్తూ విశేష అనుభవం గడించారు. అంతేకాదు ఓ వ్యాపార సంస్థను సైతం నడుపుతూ లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ తరహా ట్రెండ్‌.. మనదేశంలో కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు.

ఎవరీ టేలర్‌ ఎ హంప్రీ..?

టేలర్‌... శాన్‌ఫ్రాన్సిస్కోలో పుట్టి పెరిగారు. న్యూయార్క్‌ యూనివర్సిటీలో బిఏ పూర్తిచేశారు. ఆమెకు చిన్నతనం నుంచీ విభిన్నమైన పేర్ల మీద ఆసక్తి ఉండేది. బంధు మిత్రుల ఇళ్లలో పిల్లలు పుట్టినప్పుడు వాళ్లకు ప్రత్యేకమైన పేర్లు సూచిస్తుండేవారు. ఎంతో పరిశోధించి తను సృష్టించిన పేర్లను ఆన్‌లైన్లో షేర్‌ చేసేవారు. వాటికి మంచి ఫాలోయింగ్‌ వస్తుండేది. చదువు పూర్తయ్యాక అమెరికాలోని ప్రముఖ సంస్థల్లో మార్కెటింగ్‌, బ్రాండింగ్‌ విభాగాల్లో పనిచేశారు. మహిళలకు గర్భధారణ, ప్రసవ సమయాల్లో తగిన అవగాహన కల్పించే నిపుణురాలిగా సేవలందించారు. ఈ క్రమంలో... ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతున్న ఓ జంట తమ బిడ్డకి పెట్టే పేరు గురించి చర్చించుకోవడం విని వాళ్లతో మాటలు కలిపారు టేలర్‌. ఆ జంట ఇష్టాయిష్టాలు, కుటుంబ నేపథ్యం అడిగి తెలుసుకుని క్షణాల్లో చక్కని పేరును సూచించారు. వెంటనే ఆ తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన సంతోషం... ఆమెను ఆలోచనలో పడేసింది. ఆ క్షణమే టేలర్‌ తన అభిరుచిని కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘వాట్స్‌ ఇన్‌ ఎ బేబీ నేమ్‌’ పేరుతో ఓ వ్యాపార సంస్థను ప్రారంభించి దాని ద్వారా తన నైపుణ్యాన్ని సమాజానికి తెలియజేయడంలో విజయం సాధించారు ఆమె. కుటుంబ వారసత్వం, వంశ వృక్షాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకుని వాటికి తగ్గట్టుగా కొన్ని పేర్లను జాబితాగా రాసి తల్లిదండ్రులకు ఈ-మెయిల్‌ చేస్తానంటున్నారు టేలర్‌. ఇప్పటి వరకూ.. అమెరికాలోని శ్రీమంతులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన 500 మంది చిన్నారులకు పేర్లు సూచించానని ఆమె చెబుతున్నారు. జన్మ రాశులకు అనుగుణంగా... పలకడానికి సులభంగా ఉండే స్టయిలిష్‌ పేర్లను డిజైన్‌ చేయడంలో ఆమె నిష్ణాతురాలు. ఒక చిన్నారికి పేరు పెట్టడానికి కనీసం 26 లక్షలు వసూలు చేస్తుండడం విశేషం. ‘‘పేరంటే వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదు వారసత్వానికి ప్రతిబింబం, ఓ బ్రాండ్‌ కూడా!’’ అంటారామె. టేలర్‌కు సామాజిక మాధ్యమాల్లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

నేమ్‌ కన్సల్టెంట్స్‌ సర్వీసులు...

ఒకప్పుడు తల్లిదండ్రులు తమ ప్రాథమిక పరిజ్ఞానంతో కుటుంబంలోని పెద్దల సూచనల మేరకు పిల్లల పేర్లు నిర్ణయించేవారు. కానీ నేటి తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు తేలిక పదాలతో కూడిన విలక్షణమైన పేర్లు పెట్టాలనుకుంటున్నారు. అలాంటి పేర్లను వెతకడానికి పరిశోధించడానికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుత జీవన విధానంలో ఎప్పుడూ బిజీగా ఉండే తల్లిదండ్రులకు అది సాధ్యం కావడం లేదు. దీంతో వారు నేమ్‌ కన్సల్టెంట్స్‌ సర్వీసులవైపు చూస్తున్నారు. మనదేశంలో ఢిల్లీ, నోయిడా, ముంబై, పుణె, కోల్‌కతా తదితర నగరాల్లో ఇలాంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన శివాంగి వర్ష్నే... ఏడేళ్లుగా బేబీ నేమింగ్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. విష్ణు, లలిత సహస్రనామాలతోపాటు వేదాలు, పురాణ గ్రంథాల్లోని ఇతర శ్లోకాలను విశ్లేషించి పిల్లల పేర్లను డిజైన్‌ చేస్తారామె. ఒక్కోసారి తల్లిదండ్రులే కొన్ని పేర్లను ఎంపిక చేసుకుని వాటి అర్థాలు చెప్పమని అడుగుతుంటారని అలాంటి వాటిని కూడా పరిశీలించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేసి చక్కని పేర్లను సూచిస్తామని ఆమె తెలియజేస్తున్నారు. ఒక్కో పేరును డిజైన్‌ చేయడానికి వారం వరకూ సమయం పడుతుందన్నారు. తమ వద్ద రూ.11,000 నుంచి రూ.51,000 మధ్య మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయనీ, వాటి కింద 25 ఐడియాలతో కూడిన పేర్లు సూచిస్తామనీ, తల్లిదండ్రుల ఇష్టానుసారం మార్పులు చేస్తామనీ శివాంగి చెబుతున్నారు.

ఎన్నారైల కోసం కూడా...

విదేశాల్లో నివసించే భారతీయ కుటుంబాలకు చెందిన పిల్లల కోసం కొంతమంది కన్సల్టెంట్లు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నారు. వీరు... ఎన్నారైలు కోరుకున్నట్లుగా భారతీయత ఉట్టిపడేలా, సులభంగా పిలుచుకొనేట్లుగా వినసొంపుగా, ఉండే పేర్లను డిజైన్‌ చేస్తున్నారు.

  • కోల్‌కతాలోని ‘డస్బన్‌ నామకరణ్‌’ సంస్థ... జ్యోతిష శాస్త్రం, సంఖ్యాశాస్త్రం ఆధారంగా ఆధునిక, సంప్రదాయ పేర్లను డిజైన్‌ చేస్తోంది. అన్ని వర్గాలవారికి అందుబాటులో ఉండేలా డైమండ్‌ (రూ.10,999); గోల్డ్‌ (రూ.6,000); సిల్వర్‌ (రూ.4,500) ప్యాకేజీలను అందిస్తోంది.

  • పుణెలో ‘నేమ్‌ ఇట్‌ రైట్‌’ సంస్థను నిర్వహిస్తున్న జయ వర్మ... మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని రూ.4,000కే ప్యాకేజీని అందిస్తున్నారు. ఈ ప్యాకేజీ కింద 15 పేర్లను సూచించడంతోపాటు వాటి అర్థాలు, మతపరమైన సూచనలు, ఆ పేరు పిల్లలకు ఎలా సూటవుతుందో తెలిపే వివరణ ఉంటాయి. ఈ సంస్థకు రోజుకు 40 దాకా ఆర్డర్లు వస్తుంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2025 | 04:56 AM