The Swedish Prescription: ప్రయాణంతో ఆరోగ్యం
ABN, Publish Date - Oct 14 , 2025 | 06:05 AM
ఆరోగ్యం కోసం ప్రయాణాన్ని సూచించే మొట్టమొదటి దేశంగా తాజాగా స్వీడన్ పేరు పొందింది. ది స్వీడిష్ ప్రిస్ర్కిప్షన్ అనే కొత్త ప్రయత్నంలో భాగంగా, దేశ పర్యాటక సంస్థ, కరోలిన్‌స్కా సంస్థకు...
కొత్త వైద్యం
ఆరోగ్యం కోసం ప్రయాణాన్ని సూచించే మొట్టమొదటి దేశంగా తాజాగా స్వీడన్ పేరు పొందింది. ది స్వీడిష్ ప్రిస్ర్కిప్షన్ అనే కొత్త ప్రయత్నంలో భాగంగా, దేశ పర్యాటక సంస్థ, కరోలిన్‌స్కా సంస్థకు చెందిన పరిశోధకులు ఉమ్మడిగా, ప్రకృతి, సంస్కృతులకు ఔషధాలుగా ప్రచారం కల్పిస్తున్నారు. అడవిలో నడక, సానా, చల్లనీళ్లలో మునక, ఫీకా బ్రేక్స్, ఆకాశంలో నక్షత్రాలను వీక్షించడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం మెరుగుపడుతుందని వాళ్లు సూచిస్తున్నారు. రోగులు ఈ ప్రకృతి చికిత్సలను నిరాటంకంగా పొందడానికి వీలుగా వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అయితే ప్రయాణ ఖర్చులు తమ పరిఽధిలోకి రావనీ, చికిత్స పైనుంచి నివారణ, సమగ్రమైన ఆరోగ్యాల వైపు దృష్టిని మళ్లించడమే తమ లక్ష్యమనీ వైద్యులు ప్రిస్ర్కిప్షన్‌లో స్పష్టం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 14 , 2025 | 06:05 AM