Share News

Minister Kandula Durgesh ON AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

ABN , Publish Date - Oct 13 , 2025 | 03:02 PM

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆంధ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు.

Minister Kandula Durgesh ON AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Minister Kandula Durgesh ON AP Tourism

అమరావతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఏపీ పర్యాటక రంగానికి (AP Tourism) జాతీయ గుర్తింపు దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆంధప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) అక్టోబర్ 14, 15 తేదీల్లో పర్యటించనున్నారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల 50 పర్యాటక గమ్యస్థానాల అభివృద్ధి, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల కల్పన కోసం ఉద్దేశించిన జాతీయ మిషన్‌పై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వెళ్లనున్నారు మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులు హాజరుకానున్నారు.


పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ 2025 - 2026 ప్రకటనల అమలుపై ఏపీ విజన్‌ను సమర్పించనున్నారు మంత్రి దుర్గేష్. జాతీయ మిషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరపున ఉన్న ప్రతిపాదనలను వివరించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధాన పర్యాటక గమ్యస్థానాలను రాష్ట్రాల భాగస్వామ్యంతో 'ఛాలెంజ్ మోడ్'లో అభివృద్ధి చేయనుంది కేంద్రం ప్రభుత్వం. పర్యాటక సౌకర్యాలు, పరిశుభ్రత, మార్కెటింగ్ ప్రయత్నాలతో సహా సమర్థవంతమైన గమ్యస్థానాల నిర్వహణ కోసం పలు రాష్ట్రాలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు అందించనుంది కేంద్రం ప్రభుత్వం.


పర్యాటక ప్రాంతాల మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన భూమిని అందించనున్నాయి పలు రాష్ట్రాలు. జాతీయ మిషన్ లక్ష్యాలను సాధించేందుకు, ప్రైవేట్ పెట్టుబడులు, స్థానిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను వివరించనున్నారు మంత్రి దుర్గేష్. ఏపీ పర్యాటక శాఖలో అవలంభిస్తున్న విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అందిస్తున్న ప్రోత్సాహకాలను వెల్లడించనున్నారు మంత్రి కందుల దుర్గేష్.


అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడం, పర్యాటకులకు అద్భుత అనుభవాలను కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తున్న తీరును వెల్లడించనున్నారు. 2030 నాటికి ఆసియాలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక గమ్యస్థానాల్లో ఏపీని ఒకటిగా నిలిపేందుకు తీసుకోనున్న చర్యలను వివరించనున్నారు మంత్రి కందుల దుర్గేష్.


ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

త్వరలోనే నూతన గోదాములకు శ్రీకారం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 03:07 PM