FCI Paddy Procurement: త్వరలోనే నూతన గోదాములకు శ్రీకారం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:31 PM
శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు జిల్లాలో ఎఫ్‌సీఐ అధ్వర్యంలో నూతన గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా గోదాముల నిర్మించేందుకు ఎఫ్. సి. ఐ ముందుకు వచ్చిందని... ప్రభుత్వం తరుపున స్థలాలను అందిస్తామని అన్నారు.
విజయవాడ, అక్టోబర్ 13: గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని ఏపీ ఎఫ్.సి.ఐ అధ్యక్షులు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu Srikrishnadevarayalu) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఖరీఫ్ సీజన్‌లో 30 లక్షల ధాన్యం సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. రబీలో కూడా గత సంవత్సరం 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని... ఈ సంవత్సరం కూడా ధాన్యం సేకరణ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు జిల్లాలో ఎఫ్‌సీఐ అధ్వర్యంలో నూతన గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా గోదాముల నిర్మించేందుకు ఎఫ్. సి. ఐ ముందుకు వచ్చిందని... ప్రభుత్వం తరుపున స్థలాలను అందిస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావిస్తోందన్నారు. గోదాముల ద్వారా 45 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పుకొచ్చారు. ఎఫ్‌సీఐ మెంబర్లు 15 నుంచి 20 రోజుల లోపల గోదాముల పరిశీలనకు వెళ్తారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్
వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై
Read Latest AP News And Telugu News