Kurnool Political: వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:52 PM
రమణి కుమారితో పాటు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు మిగిలిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కర్నూలు, అక్టోబర్ 13: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గోనెగొండ్ల మండలం వైసీపీ మండల ఉపాధ్యక్షులు రమణి కుమారి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అధికార కూటమి పథకాలకు ఆకర్షతులై తన అనుచరులతో కలిసి మండల ఉపాధ్యక్షులు రమణ కుమారి టీడీపీ పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు మిగిలిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సాధారణ ఎన్నికల్లో కేవలం 11 సీట్లతో ఘోర పరాజయం పాలైన వైసీపీకి.. ఆ తరువాత నేతల రాజీనామాలతో జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వైసీపీని వీడి వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. జగన్‌కు అత్యంత సన్నిహితులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేయడంతో పార్టీ భవిష్యత్ ఏంటనే ప్రశ్నలు మొదలువుతున్నాయి. జగన్‌కు అత్యంత దగ్గరి బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎంపీలు బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య వీరంతా వైసీపీకి రాజీనామా చేసి వివిధ పార్టీల్లో చేరిపోయారు. అంతేకాకుండా వైఎస్ కుటుంబంతో అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. అసంతృప్తి కారణంగానో లేక జగన్ వ్యవహరాల శైలి నచ్చకనో ఇలా ఏ కారణంతోనే అనేక మంది ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనూ వైసీపీ మండలి ఉపాధ్యక్షులతో పాటు 200 మంది కార్యకర్తలను పార్టీని వీడారు. ఇలా తరచూ అనేక మంది నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్న నేపథ్యంలో జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి..
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం..
టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News