Pendurthi Politics: టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:37 AM
కష్టపడి పనిచేసిన నిజమైన టీడీపీ నాయకులను వేధిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. తాను ఎక్కడ ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా పెందుర్తి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
విశాఖపట్నం, అక్టోబర్ 13: వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ నేతలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి (TDP MLA Bandaru Satyanarayana Murthy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు తెలియని వారు ఈరోజు పార్టీలో ఉండడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల తర్వాత పెందుర్తి నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ వాళ్ళు టీడీపీ కండువా కప్పుకున్నారని తెలిపారు. అయితే కష్టపడి పనిచేసిన నిజమైన టీడీపీ నాయకులను వాళ్లు వేధిస్తున్నారని తన దృష్టికి వచ్చిందనన్నారు. తాను ఎక్కడ ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా పెందుర్తి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో జాయిన్ అయితే పార్టీకి కట్టుబడి పని చేయాలని.. అక్రమాలు, అన్యాయాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఎన్నో పార్టీల నుంచి పార్టీ మారమని చాలా మంది తనను అడిగేవారని... అలా చేస్తే అప్పుడు తాను మంత్రి కూడా అయ్యే వాడినని చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ కూడా పార్టీ కోసమే పని చేశాను తప్ప, పదవుల కోసం ఏనాడు రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. టీడీపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ పదవులలో సముచిత స్థానం కచ్చితంగా దక్కుతుందని వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మడక పార్వతి అభినందన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన.. ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం..
Read Latest AP News And Telugu News