Modi Kurnool Visit: 16 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన.. ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:17 AM
హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రి యల్ నోడ్‌కు రూ.2,786 కోట్లతో అభివృద్ధి పనులకు.. అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కు అభివృద్ధి కోసం రూ.2,136 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని.
కర్నూలు, అక్టోబర్ 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఆయా ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. ఈనెల 16వ తేదీన ప్రధాని శ్రీశైలం, కర్నూలులో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈరోజు (సోమవారం) సాయంత్రానికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈనెల 16న రూ.13,429 కోట్ల అంచనాలతో నిర్మించబోయే 16 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌కు రూ.2,786 కోట్లతో అభివృద్ధి పనులకు.. అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్‌కు అభివృద్ధి కోసం రూ.2,136 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని.
ఈ నేపథ్యంలో ఆయా శాఖల పనులతో తాత్కాలిక జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోయే మెజారిటీ ప్రాజెక్టులలో జాతీయ రహదారులు, రైల్వే శాఖ పనులు ఉన్నాయి. ప్రధాని మోదీ పర్యటనకు 7300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా 16న కర్నూలులో ట్రాఫిక్ ఆంక్షలు, పలు మార్గాల్లో వాహనాలను మళ్లించనునన్నారు.
ఇవి కూడా చదవండి..
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం..
కడపలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అర్ధరాత్రి సమయంలో..
Read Latest AP News And Telugu News