Share News

Tirupati Leopard: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం..

ABN , Publish Date - Oct 13 , 2025 | 09:14 AM

తాజాగా ఇటీవల ఎస్వీయూ ఏడీ బిల్డింగ్ వెనుక అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మళ్లీ యూనివర్సిటీల్లో చిరుత సంచారంపై ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది.

Tirupati Leopard: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం..
Tirupati

తిరుపతి: నగరంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి హాస్టల్ వద్ద విద్యార్థులకు చిరుత కన్పించడంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిరుతను చూసిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అధికారులు యూనివర్సిటీకి చేరుకుని చిరుత ఆనవాలను గుర్తించారు.


తాజాగా ఇటీవల ఎస్వీయూ ఏడీ బిల్డింగ్ వెనుక అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మళ్లీ యూనివర్సిటీల్లో చిరుత సంచారంపై ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో వర్సిటీల పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాటిని బంధించేందుకు 5 బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు

Dalit IPS Officer: ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్‌

Updated Date - Oct 13 , 2025 | 09:20 AM