BRS Targets Jubilee Hills: టార్గెట్ జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి రంగం సిద్ధం
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:09 AM
బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ మేరకు నేడు ఉదయం 10 గంటలకు రహమత్ నగర్‌లోని SPR గ్రౌండ్స్ వద్ద విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ మేరకు నేడు ఉదయం 10 గంటలకు రహమత్ నగర్‌లోని SPR గ్రౌండ్స్ వద్ద విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమావేశానికి సుమారు ఐదువేల మంది కేడర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొనున్నారు.
ఉప ఎన్నికలపై దిశానిర్దేశం
ఈ సమావేశం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులకు ఉప ఎన్నికల ప్రచార వ్యూహంపై స్పష్టత ఇవ్వనున్నారు. పాదయాత్రలు, ర్యాలీలు, సభలు, డోర్ టు డోర్ ప్రచారాలపై పార్టీ నాయకత్వం కేడర్‌కు దిశానిర్దేశం చేయనుంది.
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే లక్ష్యం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం. ఈ ఉప ఎన్నిక ద్వారా పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని ప్రజలకు ఇచ్చేందుకు పార్టీ పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచిస్తోంది.
మాగంటి సునీత
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఈనెల 15వ తేదీన అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెను పోటీకి దింపి విజయం సాధించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
నోబెల్ శాంతి బహుమతి సమాచారం లీక్
58 మంది పాక్ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి