Kadapa Tragic Incident: కడపలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అర్ధరాత్రి సమయంలో..
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:10 AM
కడప నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కడప: నగరంలోని శంకరాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్త తమ కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురూ కలిసి అర్ధరాత్రి సమయంలో కృష్ణాపురం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు క్రిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీలను శ్రీరాములు, ఆయన భార్య శిరీష, కుమారుడు రుత్విక్‌గా పోలీసులు గుర్తించారు.
కుటుంబ కలహాలే కారణమా?
ప్రాథమికంగా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాలను రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసులు.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమీప నివాసితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
Also Read:
తెలంగాణలో హ్యామ్ రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నిధులు విడుదల
బతికుండగానే అంత్యక్రియలు.. 74ఏళ్ల వ్యక్తి వింత కోరిక
For More Latest News