Ham Roads: తెలంగాణలో హ్యామ్ రోడ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నిధులు విడుదల
ABN , Publish Date - Oct 13 , 2025 | 08:44 AM
రాష్ట్రంలో రూ.25,661 కోట్లతో రహదారి నిర్మాణాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదు హైవేలకు చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 431 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి అనుమతి లభించింది. హ్యామ్ విధానంలో కేంద్రం-ఎన్‌హెచ్ఏఐ నిధుల్లో 40:60 నిష్పత్తితో రోడ్ల నిర్మాణం జరుగనుంది. ఆర్మూర్-జగిత్యాల రహదారి నాలుగు లేన్లుగా విస్తరిస్తూ అభివృద్ధి చేయనున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణలో హ్యామ్ రోడ్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రూ.25,661 కోట్లతో రహదారి నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల జాబితాలో తెలంగాణ నుంచి ఐదు హైవేలకు చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 431 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి అనుమతి లభించింది. హ్యామ్ విధానంలో కేంద్రం-ఎన్‌హెచ్ఏఐ నిధుల్లో 40:60 నిష్పత్తితో రోడ్ల నిర్మాణం జరుగనుంది. ఆర్మూర్-జగిత్యాల రహదారి నాలుగు లేన్లుగా విస్తరిస్తూ అభివృద్ధి చేయనున్నారు.
ఇక జగిత్యాల-మంచిర్యాల హైవే విస్తరణకు రూ.2,550 కోట్ల మంజూరు అయింది. జగిత్యాల-కరీంనగర్ రహదారికి రూ. 2,384 కోట్లు కేటాయించారు. అర్మూర్-జగిత్యాల రహదారి నిర్మాణానికి రూ.2,338 కోట్లు ఆమోదం లభించింది. హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు రూ.15,627 కోట్ల నిధుల కేటాయించారు. మహబూబ్‌నగర్-రాయచూర్ రహదారి ఫోర్ లేన్‌గా విస్తరణకు రూ.2,662 కోట్లు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కొత్త రోడ్డు మ్యాప్ ఏర్పాటు చేయనున్నారు.
ఇంకా చదవండి:
Teacher Inspection Committees: విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలల తనిఖీలకు టీచర్ల కమిటీలు
Health Care: రక్తశుద్ధికి వెళితే కొత్త రోగాలు