Teacher Inspection Committees: విద్యాశాఖ కీలక నిర్ణయం.. పాఠశాలల తనిఖీలకు టీచర్ల కమిటీలు
ABN , Publish Date - Oct 13 , 2025 | 08:37 AM
ప్రైమరీ స్కూల్ కమిటీకి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, యూపీఎస్ కమిటీకి స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా ఉంటారు. మరో ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలకు టీచర్ల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా నాణ్యత పెంచేందుకు విద్యాశాఖ తనిఖీలకు సిద్ధమైంది. మొత్తం 299 టీచర్ల కమిటీల నియామకానికి సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి 100 ప్రాథమిక, 50 ఉన్నత పాఠశాలలకు ఒక తనిఖీ కమిటీ ఏర్పాటు చేేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతి వారం డీఈఓలకు టీచర్లు నివేదికలు సమర్పించనున్నారు. మూడు నెలల్లో నిర్దేశిత లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు.
ప్రైమరీ స్కూల్ కమిటీకి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, యూపీఎస్ కమిటీకి స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా ఉంటారు. మరో ఇద్దరు సభ్యులుగా వ్యవహరిస్తారు. హైస్కూళ్ల కమిటీలో ఒక నోడల్ అధికారితోపాటు ఎనిమిది మంది సభ్యులను నియమిస్తారు. ఆ కమిటీకి గెజిటెడ్ హెచ్‌ఎం నోడల్ అధికారిగా ఉంటారు. సభ్యులుగా సబ్జెక్టు టీచర్లు, పీఈటీ వ్యవహరిస్తారు. అయితే ఇప్పటికే టీచర్లను ఎంపిక చేసి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సంచాలకుడు డీఈఓలను ఆదేశించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు
Dalit IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్