Funerals While Still Alive: బతికుండగానే అంత్యక్రియలు.. 74ఏళ్ల వ్యక్తి వింత కోరిక
ABN , Publish Date - Oct 13 , 2025 | 08:24 AM
మాజీ వైమానిక దళ సైనికుడు మోహన్ లాల్(74)కు తాను మృతి చెందిన తరువాత తన అంత్యక్రియలకు ఎంత మంది హాజరవుతారు? ఎలా నిర్వహిస్తారు? అనే వింత కోరిక పుట్టింది. అనుకున్నదే తడవుగా తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇక బంధు మిత్రులను, పరిచయస్తులను అందరినీ ఆహ్వానించి తన అంత్య క్రియలను తానే నిర్వహించుకున్నారు.
బిహార్, అక్టోబర్ 13: సాధారణంగా మనుషుల వింత కోరికలు ఒక్కోలా ఉంటాయి. కొందరు ప్రపంచం మొత్తం చుట్టేసి రావాలని కోరుకుంటే.. మరికొందరికి వేరే కోరికలు ఉంటాయి. కానీ ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. తన అంత్యక్రియలను తానే చూడాలనుకున్నాడు. చనిపోక ముందు అనేక కార్యక్రమాలు మనం చూసే ఉంటాం.. కానీ చనిపోయాక మన అంతయక్రియలను చూడలేం. అంత్య క్రియలు ఎలా జరుగుతాయి? ఎవరు ఎలా ప్రవర్తిస్తారు? తన కుటుంబీకులు ఎలా ఏడుస్తారు? ఇలా అన్ని తాను చూడాలనుకున్నారు. ఇక అనుకున్నదే తడవుగా తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్నారు.
అయితే ఇదంతా ఒక సామాన్య వ్యక్తికి వచ్చిన ఆలోచన అనుకుంటే పొరపాటే. ఇలా వినూత్నంగా, వింతగా ఆలోచించారు మాజీ వైమానిక దళ సైనికుడు. బిహార్ గయా జిల్లాలోని కొంచి గ్రామానికి చెందిన 74 ఏళ్ల మోహన్‌లాల్ ఎయిర్‌ఫోర్సులో పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. జీవితంగా అందరూ స్థిరపడ్డారు. ఒకరు కలకత్తాలో డాక్టర్ కాగా, మరొకరు స్కూల్ లో టీచర్‌గా పనిచేస్తున్నారు. కూతురు ధన్‌బాద్‌లో తన కుటుంబంతో ఉంటోంది. భార్య జీవన్ జ్యోతి 14 ఏళ్ల కిందట చనిపోయింది.
మోహన్ లాల్‌కు తాను మృతి చెందిన తరువాత తన అంత్యక్రియలకు ఎంత మంది హాజరవుతారు? ఎలా నిర్వహిస్తారు? అనే వింత కోరిక పుట్టింది. అనుకున్నదే తడవుగా తన కోరికను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇక బంధు మిత్రులను, పరిచయస్తులను అందరినీ ఆహ్వానించి తన అంత్య క్రియలను తానే నిర్వహించుకున్నారు. బతికుండగానే చివరి ప్రయాణానికి అందరూ హాజరయ్యారు. చనిపోయిన వారికి కప్పినట్లుగానే అతన్ని తెల్లటి దుస్తులు వేశారు. మెడలో పూల దండలు వేసి, పడుకోబెట్టి డప్పు చప్పుళ్లతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అగ్నికుంభంతో ముందుకు నడుస్తుండగా.. అతని పాడెను నలుగురు మోస్తూ కుటుంబ సభ్యుల ఆర్తనాదాల నడుమ చితిపై పడుకోబెట్టారు. చితిపై తాను పడుకున్నాక అక్కడి వారి ఆర్తనాదాలు తనివితీరా విన్నారు. తనకు చావు ఎదురైతే తనవారు ఎలా కన్నీరు పెడుతారో ఆసాంతం తిలకించారు. అంతక్రియలపై ఆయన తృప్తి పొందాక.. అతని స్థానంలో దిష్టిబొమ్మను పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు. చుట్టాల కన్నీటి ఏడుపు మధ్య దిష్ఠి బొమ్మకు అంత్య క్రియలు నిర్వహించారు. ఇక చితిని కాల్చాక ఆ బూడిదను నదిలో కలిపారు. అంతిమ సంస్కారాల తర్వాత చేయాల్సిన విధివిధానాన్నంతా పాటించారు. దీంతో తృప్తిపొందిన మోహన్ లాల్.. ఆ తర్వాత వచ్చిన జనాలందరకీ సామూహిక భోజనాలు పెట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడీయో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
Dalit IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్
Thiruvananthapuram: కేరళలో మెదడు తినే అమీబా కలకలం