Liquor Scam Case Updates: మద్యం కుంభకోణంలో కీలక మలుపు
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:44 PM
మద్యం కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. నిందితులకు ఈ నెల 16 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.
అమరావతి: మద్యం కుంభకోణం కేసులో ఈ రోజు ఏసీబీ కోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన పలువురికి ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.
న్యూయార్క్ వెళ్లాలన్నమిథున్ రెడ్డి
ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఈ నెల 20వ తేదీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనపై స్పందించిన కోర్టు, సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
వెన్నునొప్పితో చెవిరెడ్డి
మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి కోర్టులో తన ఆరోగ్య పరిస్థితిపై పలు విన్నపాలు చేశారు. తాను తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నానని తెలిపారు. నిన్న, మొన్న ఆసుపత్రిలో చూపించుకున్నానని కోర్టుకు వివరించారు. వైద్యులు ఫిజియోథెరపీ చేయించాలని సూచించారని చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మంతెన ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, తాను పోలీస్ కస్టడీలోనే చికిత్స చేయించుకుంటానని కోర్టుకు స్పష్టం చేశారు. నొప్పి భరించలేకపోతున్నానని కోర్టులో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనపై కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణలో పరిశీలిస్తామని తెలిపింది.
Also Read:
కుక్క నుంచి నేర్చుకోవలసిన 4 గుణాలు
నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ..
For More Latest News