Jubilee Hills By-Election: నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ..
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:13 AM
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 14న యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల కౌంటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇవాళ(సోమవారం) ఉదయం 11 గంటలు నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 21 వరకు నామినేషన్లకు గడువు ఉండనున్నట్లు పేర్కొన్నారు. షేక్‌పేట్ ఎమ్మార్వో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్‌లో నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. అలాగే.. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 24 వరకు అధికారులు అవకాశం కల్పించారు.
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 14న యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్లు కౌంటింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ ఆఫీస్‌కి 100 మీటర్ల మేర ఆంక్షలు విధించినట్లు చెప్పారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీస్‌లోకి అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే.. రిటర్నింగ్ ఆఫీస్‌లోపలికి 3 వాహనాలు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులకు ఒక ప్రతిపాదించే నియోజకవర్గ ఓటరు ఉండాలని పేర్కొన్నారు. ఇండిపెండెంట్, గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులకు పది మంది నియోజకవర్గ ఓటర్లు ప్రతిపాదించాలని వివరించారు. వెబ్‌సైట్ https://encore.eci.gov.in ద్వారా ఆన్లైన్‌లో నామినేషన్ పత్రాలను అప్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అప్‌లోడ్ చేసిన తరువాత వచ్చే ప్రింటెడ్ హార్డ్ కాపీని రిటర్నింగ్ ఆఫీసర్‌కు తప్పకుండా అందించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు
Dalit IPS Officer: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్