Share News

Minister Nimmala Ramanaidu: వైసీపీ అబద్ధాలను నమ్ముకొని మనుగడ సాగిస్తోంది..

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:35 PM

రాయలసీమకు హంద్రీనీవా ప్రాజెక్టు గుండెకాయ అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

Minister Nimmala Ramanaidu: వైసీపీ అబద్ధాలను నమ్ముకొని మనుగడ సాగిస్తోంది..
Minister Nimmala Ramanaidu

కర్నూల్: ప్రధాన మంత్రి మోదీ పర్యటన కోసం రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జీఎస్టీలో మార్పులు చేయడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబానికి ఏడాదికి 20 నుంచి 40 వేలు ఆదా అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం మీద దాదాపుగా 8 వేల కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలో ఎప్పుడు ధరలు పెరగడం చూశాం. జీఎస్టీ సంస్కరణ వల్ల ధరలు తగ్గడం కూటమి ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీలో మార్పుల వల్ల మందులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల ధరలు భారీగా తగ్గాయని ఆయన స్పష్టం చేశారు.


అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు..

రాయలసీమకు హంద్రీనీవా ప్రాజెక్టు గుండెకాయ అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అతి తక్కువ సమయంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ కాలువను విస్తరణ పనులు చేపట్టి, చివరి ఆయకట్టుకు నీరు అందించిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి నిమ్మల కొనియాడారు.


ఇది మా చిత్తశుద్ధి..

అనంతరం.. వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. వైసీపీ అబద్ధాలను నమ్ముకొని మనుగడ సాగిస్తోందని ఆరోపించారు. నాసిరకం మద్యానికి ఆద్యుడు మాజీ సీఎం జగనే అని విమర్శించారు. మొలకలచెరువులో నకిలీ మధ్యం స్కామ్ బయట పెట్టిందే కూటమి ప్రభుత్వమని గుర్తు చేశారు. ఇందులో సొంత పార్టీ నాయకుల ప్రమేయం ఉందని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఇది తమ చిత్తశుద్ధి అని ధీమా వ్యక్తం చేశారు. సిట్ విచారణలో అన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని ఆయన చెప్పుకొచ్చారు.


మహిళల తాళి బొట్లను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్..

మద్యంపై అప్పులు తెచ్చి మహిళల తాళిబొట్లను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ అని మంత్రి నిమ్మల మండిపడ్డారు. గతంలో వెస్ట్ గోదావరి జిల్లాలో 27మంది నాసిరకం మద్యం తాగి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు. జగన్ పాలనలో పరిశ్రమల యాజమాన్యాలు ఎంతో అలజడికి గురయ్యారని పేర్కొన్నారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు.


ఇవి కూడా చదవండి..

Central Govt: పాఠశాలల్లో యూపీఐతో ఫీజుల వసూలు

Dalit IPS Officer: ఐపీఎస్‌ అధికారి ఆత్మహత్యలో కొత్తగా అట్రాసిటీ సెక్షన్‌

Updated Date - Oct 13 , 2025 | 12:54 PM