Share News

Vinutha Kota on Driver Rayudu Case: నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ABN , Publish Date - Oct 13 , 2025 | 02:30 PM

శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి వినుత కోట ఓ వీడియో విడుదల చేశారు. తన మనసు నిండా పుట్టేడు బాధతో ఈ వీడియో విడుదల చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Vinutha Kota on Driver Rayudu Case: నాపై కుట్రలు చేశారు... వినుత  కోట ఎమోషనల్
Vinutha Kota on Driver Rayudu Case

తిరుపతి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీ కాళహస్తి జనసేన (Janasena) మాజీ ఇన్‌చార్జి వినుత కోట (Vinutha Kota) ఇవాళ(సోమవారం) ఓ వీడియో విడుదల చేశారు. తన మనసు నిండా పుట్టేడు బాధతో ఈ వీడియో విడుదల చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన డ్రైవర్ రాయుడు (Driver Rayudu) ని తాను హత్య చేయలేదని.. అయినా కూడా ఈ కేసులో జైలుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తనకు బాధలేదు గానీ, తాను చంపానని జరుగుతున్న ప్రచారం ఎక్కువగా బాధించిందని తెలిపారు వినుత కోట.


తాను లక్షల రూపాయల జీతం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయటానికి మాత్రమేనని స్పష్టం చేశారు. హత్యలు చేయటానికి తాను రాజకీయాల్లోకి రాలేదని.. ఆ మనస్తత్వం తనది కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో తనకు ప్రమేయం లేదని కోర్టులో రుజువు చేసుకుని బయటకు వస్తానని చెప్పుకొచ్చారు. క్లీన్ చిట్‌తో తాను బయటకు వస్తానని స్పష్టం చేశారు వినుత కోట.


డ్రైవర్ రాయుడు హత్య కేసు కోర్టులో ఉన్నందున ఇంతకు మించి తాను ఏం మాట్లాడటం లేదని తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ని కలవటానికి తాను ప్రయత్నించానని గుర్తుచేశారు. తాను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనపై జరిగిన కుట్రలకు సంబంధించి పూర్తి ఆధారాలతో కూడిన వీడియోని త్వరలోనే ప్రజల ముందుకు తీసుకు వస్తానని వినుత కోట పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మద్యం కుంభకోణంలో కీలక మలుపు

త్వరలోనే నూతన గోదాములకు శ్రీకారం: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 02:45 PM