Short Kurta Fashion: కవ్వించే కుర్తా
ABN, Publish Date - Aug 20 , 2025 | 01:25 AM
పొట్టిగా, పొందికగా ఉండే షార్ట్ కుర్తాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. వీటిని సరైన బాటమ్స్‌తో జోడిస్తే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా వెలిగిపోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం!...
ఫ్యాషన్
పొట్టిగా, పొందికగా ఉండే షార్ట్ కుర్తాలు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. వీటిని సరైన బాటమ్స్‌తో జోడిస్తే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా వెలిగిపోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం!
జీన్స్, లెగ్గింగ్స్, జెగ్గింగ్స్ ఽధరించినప్పుడు సౌకర్యంగా ఉండే షార్ట్ కుర్తాలు వేసుకోవచ్చు
కాటన్, సింథటిక్ మెటీరియల్స్‌లో దొరికే ఈ చిట్టిపొట్టి కుర్తాలు ఆకర్షణీయంగా, ఆధునికంగా ఉంటాయి
సౌకర్యానికి పెద్ద పీట వేసే షార్ట్ కుర్తాలను లాంగ్ స్కర్ట్‌తో మ్యాచ్ చేయొచ్చు
ఈవినింగ్ పార్టీలు, ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్స్‌కు షార్ట్ కుర్తాలు స్టైలిష్‌గా ఉంటాయి.
లతలు, పువ్వుల డిజైన్లు ఉన్న షార్ట్ కుర్తాలు యాంకిల్ లెంగ్త్ జీన్స్‌కు చక్కగా సూటవుతాయి. పెన్సిల్ హీల్స్‌ను ఈ డ్రస్‌కు మ్యాచ్ చేస్తే చూడముచ్చటగా కనిపిస్తారు
సింపుల్‌గా, హూందాగా కనిపించాలనుకునేవాళ్లు షార్ట్ కుర్తాలను ఎంచుకోవచ్చు
చికన్ వర్క్ కుర్తాల్లో షార్ట్ లెంగ్త్ కూడా ఉంటాయి.
ఇవి కాలేజీ అమ్మాయిలకు చక్కగా సూటవుతాయి సినిమాలు, షికార్లకు ఈ రకం కుర్తాలు అనువైన స్టైల్!
షార్ట్ కుర్తా ఫుల్ హ్యాండ్స్ వేసినా, షార్ట్ హ్యాండ్ ఉన్నా, స్లీవ్‌లెస్ అయినా... ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి అనువైన కుర్తా ఎంచుకోవాలి.
యాక్సెసరీస్ ఇలా...
యాంటిక్ జ్యువెలరీ, ఉడెన్ లేదా టెర్రకోటా జ్యువెలరీ ఈ తరహా దుస్తులకు నప్పుతాయి
స్లింగ్ బ్యాగ్ చక్కగా మ్యాచ్ అవుతుంది
హై హీల్స్, ఫ్లాట్స్.. రెండు రకాల ఫుట్ వేర్ వేసుకోవచ్చు
భారీ నెక్లెస్‌లూ, కడాలూ లాంటివి ధరించకపోవడమే మేలు
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 20 , 2025 | 01:25 AM