Types Of Raincoats: రక్షణనిచ్చే రెయిన్ కోట్స్
ABN, Publish Date - Aug 13 , 2025 | 12:48 AM
రెయిన్ కోట్లు వానకు తడవకుండా రక్షణ కల్పించడమే కాదు, సౌకర్యవంతంగా, ఆకట్టుకునేలా ఉండాలి. కాబట్టే నేడు రెయిన్‌కోట్లలో పలు రకాల పోకడలు పుట్టుకొచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...
ఫ్యాషన్
రెయిన్ కోట్లు వానకు తడవకుండా రక్షణ కల్పించడమే కాదు, సౌకర్యవంతంగా, ఆకట్టుకునేలా ఉండాలి. కాబట్టే నేడు రెయిన్‌కోట్లలో పలు రకాల పోకడలు పుట్టుకొచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం!
వేర్వేరు రకాల రెయిన్‌కోట్స్ వేర్వేరు స్థాయుల్లో వానల నుంచి రక్షణ కల్పిస్తాయి. అవేంటంటే....
పాంచోస్: ఇవి వదులుగా ఉంటాయి. ధరించడం కూడా తేలికే! పైనుంచి మోకాళ్ల వరకూ పొడవుండే ఈ రెయిన్‌కోట్స్‌కు హుడీ కూడా ఉంటుంది. భారీ వర్షంలో తల తడవకుండా ఉండడానికి ఈ ఏర్పాటు ఎంతో బాగా ఉపయోగపడుతుంది
రెయిన్ జాకెట్: ఇవి పొట్టిగా, నడుము లేదా పిరుదుల వరకూ ఉంటాయి. తేలికగా ఉండే ఈ రెయిన్ జాకెట్స్ ధరించడం కూడా సులువే! వీటిని అందుకుని, చటుక్కున వేసేసుకోవచ్చు
వాటర్‌ప్రూఫ్ రెయున్‌కోట్స్: ఇవి నీటిని ఫ్యాబ్రిక్ గుండా లోపలకు చొరబడనివ్వవు. కుండపోత వర్షాల కోసం రూపొందిన ఈ రెయిన్‌కోట్స్, ఎక్కువసేపు కురిసే వానల నుంచి రక్షణనిస్తాయి
వాటర్ రెసిస్టెంట్ రెయిన్‌కోట్స్: ఇవి తేలికపాటి వర్షాలు, తక్కువ సమయం పాటు కురిసే వానల నుంచి రక్షణ కల్పిస్తాయి. వాన కురిసే సమయం పెరిగితే, ఇవి తేమను పీల్చుకోవడం మొదలుపెడతాయి
వాటర్ రిపెల్లెంట్ రెయిన్‌కోట్స్: వీటికి ప్రత్యేకమైన కోటింగ్ ఉంటుంది. దాని వల్ల నీరు రెయిన్‌కోట్ మీద నిలవదు. వీటి మీద డిడబ్ల్యుఆర్ (డ్యూరబుల్ వాటర్ రిపెల్లెంట్) అనే అక్షరాలు ముద్రించి ఉంటాయి. వాటిని వెతికి కొనుక్కోవాలి.
బ్రీతబుల్ రెయిన్‌కోట్స్: ఈ రెయిన్‌కోట్స్ వాన నీటిని అడ్డుకోవడంతో పాటు, లోపలి నుంచి వేడి, తేమలు బయటకువెళ్లేలా చేస్తాయి. ఇవి రెయిన్‌కోట్ లోపల వేడి పెరగకుండా, చమట పట్టకుండా నియంత్రిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 13 , 2025 | 12:49 AM