ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sri Sathya Sai Baba: ప్రేమైకమూర్తి

ABN, Publish Date - Nov 21 , 2025 | 06:19 AM

సత్యలోకం అనగానే బ్రహ్మ, వైకుంఠం అనగానే శ్రీహరి, కైలాసం అనగానే శంకరుడు, శ్రీమన్నగరం అనగానే లలితాదేవి గుర్తుకు వచ్చినట్టు... సత్యసాయి అనగానే పుట్టపర్తి గుర్తుకు వస్తుంది....

విశేషం

23న శ్రీసత్యసాయిబాబా జయంతి

సత్యలోకం అనగానే బ్రహ్మ, వైకుంఠం అనగానే శ్రీహరి, కైలాసం అనగానే శంకరుడు, శ్రీమన్నగరం అనగానే లలితాదేవి గుర్తుకు వచ్చినట్టు... సత్యసాయి అనగానే పుట్టపర్తి గుర్తుకు వస్తుంది. ఈర్ష్య, ద్వేషం, అసూయ, అసహనం లాంటివి మచ్చుకైనా కనిపించని నిరంతర దైవ ధ్యానమయమైన ఆలయం... ఆయన హృదయం. మానవతా సరోవరాలు ఆయన నేత్రాలు. ఆయన చెవులు ఎవరి ఆర్తి ఎంతటితో ఆలకిస్తూ, ‘దాన్ని ఎలా తీర్చాలా?’ అని పరితపించే మాతృసమానమైన రక్షణ మందిరాలు.

శ్రీ సత్యసాయిబాబా కారణ జన్ముడు. అలా కానట్టయితే... కేవలం ఎనిమిదో తరగతి చదివి, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల వాఙ్మయ పరిచయం ఏమాత్రం లేకుండా... ఆశువుగా దైవ కీర్తనలు పాడడం, సంస్కృత శ్లోకాలను వల్లించడం, పండితులకు కూడా అంతుపట్టని సమన్వయ విధానాలు లాంటివి స్వామి ప్రదర్శించే అవకాశం లేదు. తొమ్మిదేళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి నిరంతరం ధ్యానంలోనే ఆయన ఉండేవారు. ఈ ధోరణి ఆయన తల్లిదండ్రులకు, ఎరిగినవారికి ఏవేవో భయాలు కలిగించాయి. ధ్యానంలో ఉండే రుచిని వారికీ తెలియజేస్తే ఆ అపోహలు తొలగిపోతాయని స్వామి భావించారు. వారందరినీ దగ్గరకు చేర్చి సామూహిక భజనలు చేయించసాగారు. స్వామి పాడుతున్న కీర్తనలకు, శ్లోకాలకు అర్థాలు తెలియకపోయినా... ఆ సామూహిక రమణీయ దైవ ధ్యాన నాదం అందరిలోనూ ఏదో తెలియని స్ఫూర్తి కలిగించింది. సాధారణ జీవులుగా ఈ లోకం నుంచి నిష్క్రమించడం కాకుండా... తమ జీవితాలను ధన్యం చేసుకోవాలనే తపన పెరిగింది. క్రమంగా ధ్యానాన్ని తీవ్రతరం చేసిన స్వామి... తపస్సు ప్రారంభించారు. ఈ వార్త గ్రామ గ్రామాలకూ వ్యాపించింది. 1941లో... అంటే తన పదిహేనవ ఏట... ఈ ప్రపంంచంలో ఏం జరగబోతోందో స్వామి వివరించి చెప్పారు. అది అక్షర సత్యం అయింది.

ధ్యానం, సేవ, ప్రేమ

నిష్కల్మషమైన మనసు ఏ భావాన్ని బుద్ధిపూర్వకంగా పలికిస్తుందో... అది నిజమై తీరుతుందనడానికి ఆయన మాటలే సాక్ష్యం. ‘‘ఆ దైవమే మన శరీరాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకోవాలని అనుకుంటే... మనం ఎవరెవరో గొప్పవారిని ఆశ్రయించం, ప్రాధేయపడం. వారే మన దగ్గరకు వస్తారు. ‘‘ఇంటికి కాపలాగా ఉన్న నల్లకుక్కకు అన్నం పెట్టాలంటే... తినేసిన విస్తరాకులను దాని ముందు పడెయ్యం. చక్కగా విస్తరి నిండా అన్నం పెట్టి ప్రేమగా పిలుస్తాం. ఆ విస్తరిని చూపిస్తాం. అది తింటూ ఉంటే ఆనందపడతాం. అలాంటి నల్ల కుక్కను నేను’’ అని షిరిడీ సాయిబాబా అన్నారు. ‘‘దైవం మనకు శరీరమనే రమణీయ సౌధాన్ని ‘‘చక్కగా వాడుకో!’’ అని ఇచ్చాడు. మనం ఉన్నంతకాలం దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ సౌధంలో వెలుగును ఇచ్చే దీపాన్ని వెలిగించాలంటే దైవధ్యానమే సరైన ఉపాయం. అందుకే నిరంతరం ధ్యానం చేస్తూ ఉందాం. వాల్మీకి, వ్యాసాది మహర్షులు, దేవతలు కూడా తపస్సు ద్వారానే శక్తిమంతులయ్యారు. ఇదంతా వారు దీన రక్షణ కోసమే కదా చేసింది’’ అని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. మనం ఆ మార్గంలో నడుద్దాం’’ అని పిలుపునిస్తూ... దైవ ధ్యానాన్ని విస్తృతం చేయడానికి సత్యసాయిబాబా ప్రయత్నించారు. దానికి సేవ, ప్రేమ అనే రెండు అంశాలను జోడించారు.

సంకల్పం సాకారమై...

శ్రీసత్యసాయి సంకల్పమే మానవాళి శ్రేయస్సుకు తరుణోపాయమని దైవం భావించాడు కాబట్టే... సాకమ్మ అనే పుణ్యాత్మురాలు నేటి ప్రశాంతి నిలయాన్ని స్వయంగా నిర్మించి ఇచ్చారు. అక్కడ నిరంతరం రుద్ర పారాయణ జరుగుతూ ఉంటుంది. 1958లో వైద్యావసరాలను ఉచితంగా తీర్చాలనుకుంటున్నానని ఆయన ప్రకటించగానే... జనరల్‌ ఆసుపత్రి ఏర్పాటయింది. అక్కడ సేవలకు ఎవరూ ఏమీ ఇవ్వనక్కరలేదనే ప్రకటనలు కనిపిస్తాయి. పిల్లలకు నీతి కథలను, పురాణ గాథలను వినిపించాలని ఆయన చెప్పగానే... 1966లో బాలవికాస్‌ ఆవిర్భవించింది. అక్కడ ఎందరో తల్లులు ఉచితంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1971లో బెంగళూరులో కళాశాల, 1981లో అత్యున్నతమైన విశ్వవిద్యాలయం, దైవధ్యానంలో మనశ్శాంతిని పొందాలని వస్తున్న 185 దేశాల భక్తుల కోసం విమానాశ్రయం, 1992లో అంతర్జాతీయ ప్రమాణాలతో సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, 1995లో... 600కు పైగా గ్రామాలకు, ఏడు పట్టణాలకు శాశ్వతంగా జలవసతి కల్పించే రాయలసీమ తాగు నీటి పథకం... నిర్విఘ్నంగా ఏర్పాటయ్యాయి. ఆరువేలమందికి పైగా విదేశీ ప్రతినిధులతో యువ జన సమ్మేళనం, సామూహిక ఉపనయన కార్యక్రమం, నిరంతర వేద ఘోష, నిత్య నగర సంకీర్తన, మహనీయుల ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, పండుగ రోజుల్లో దేవాలయాలకన్నా మిన్నగా యజ్ఞయాగాది కార్యక్రమాలు... ఇలా ఎన్నో కార్యాలు అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉన్నాయి.

అంతా ఆయన ఆశీర్వాదం...

ఇలా ఒక్కొక్కటీ వివరించాలంటే ఒక్కొక్క గ్రంథమే అవుతుంది. ప్రశాంతి నిలయంలో ఎనభై వేలమందికి పైగా కూర్చున్నా... చిన్న ధ్వని కూడా వినిపించదు. అందరూ స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలతో ఒకేలా ఉంటారు. ఎలాంటి ప్రకటనలు ఉండవు. ఎవరి తరువాత ఎవరు మాట్లాడాలో, ఏ భాషా గీతాన్ని ఆలపించాలో... అంతా క్రమబద్ధంగా సాగిపోతుంది. కోటీశ్వరుల నుంచి సామాన్యుల వరకూ, రాజకీయ నేతలు, కలెక్టర్ల లాంటి ఉన్నతాధికారుల నుంచి మామూలు వ్యక్తుల వరకూ అందరూ అక్కడ సమానమే. అందరూ సేవకులుగా, ప్రేమస్వరూపుల్లా కనిపిస్తారు. ఇదంతా శ్రీసత్యసాయి సంకల్పబలం, ఆశీర్వాద ఫలం.

డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

9866700425

కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 06:19 AM