ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Skating Champion: స్కేటింగ్‌ రాజ్‌

ABN, Publish Date - Aug 21 , 2025 | 05:32 AM

కాళ్లకు చక్రాలు కట్టుకొని... రయ్యిన దూసుకుపోతుంటే... ఇదేదో బాగుందనుకుంది. అమ్మానాన్నల అండతో సరదాగా స్కేటింగ్‌ రింక్‌లోకి దిగింది. అలా నాలుగేళ్లప్పుడు మొదలై...

విజేత

కాళ్లకు చక్రాలు కట్టుకొని... రయ్యిన దూసుకుపోతుంటే... ఇదేదో బాగుందనుకుంది. అమ్మానాన్నల అండతో సరదాగా స్కేటింగ్‌ రింక్‌లోకి దిగింది. అలా నాలుగేళ్లప్పుడు మొదలై... ఎన్నో పతకాలు వశమై...ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోంది. ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌’ గ్రహీత... ఆసియా రోలర్‌ స్కేటింగ్‌ రజత పతక విజేత... పధ్నాలుగేళ్ల మాత్రపు జెస్సీరాజ్‌తో ‘నవ్య’ మాటామంతి.

‘‘అప్పుడు నాకు నాలుగేళ్లు. మా అమ్మానాన్న రాధ, సురేష్‌ నన్ను ఏలూరు ఇండోర్‌ స్టేడియానికి తీసుకువెళ్లారు. అక్కడ స్కేటింగ్‌ రింక్‌ చూపించి... ‘ఇదేదో గేమ్‌ బాగుంది... నేర్చుకొంటావా’ అని అడిగారట. నేను సరే అన్నానట. వెంటనే స్కేటింగ్‌ శిక్షణలో చేర్చారట. మాది ఏలూరు జిల్లా దెందులూరు మండలం జోగన్నపాలెం. వారంలో రెండుమూడు రోజులు శిక్షణ కోసం ఏలూరు తీసుకువెళ్లేవారు. సాధనలో చిన్న చిన్న దెబ్బలు తగులుతుండేవి. దాంతో భయపడి స్కేటింగ్‌ మానేశాను. తరువాత మా కుటుంబం మంగళగిరికి వచ్చి స్థిరపడింది. నాకు మళ్లీ స్కేటింగ్‌ నేర్చుకోవాలని అనిపించింది. దాంతో విజయవాడ దండమూడి రాజగోపాలరావు స్టేడియానికి తీసుకువెళ్లారు. అక్కడ కోచ్‌ సింహాద్రి వద్ద శిక్షణకు చేర్చారు.

తొలి పోటీలోనే...

రింక్‌లో వేగంగా కదలాలంటే రన్నింగ్‌ అవసరమని కోచ్‌ చెప్పారు. దాంతో రన్నింగ్‌లో కూడా శిక్షణ ప్రారంభించాను. వారంలో మూడు రోజులు పరుగు, మూడు రోజులు స్కేటింగ్‌. నాన్న నన్ను వెంటబెట్టుకొని స్టేడియానికి తీసుకువెళ్లేవారు. సాధనలో దెబ్బలు తగులుతుండేవి. ‘వాటికి భయపడితే ఆటలో ముందుకు వెళ్లలేవు’ అని నాన్న చెప్పారు. ఆ మాటలు నాలో పట్టుదలను పెంచాయి. ప్రొఫెషనల్‌ స్కేటర్‌ను అవ్వాలని అనుకున్నాను. దాని కోసం పదేళ్ల వయసులో ఆర్టిస్టిక్‌ సోలో డ్యాన్స్‌ స్కేటింగ్‌లో అభ్యాసం ప్రారంభించాను. 2020లో విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా అండర్‌-14 విభాగంలో పాల్గొన్నాను. తొలి పోటీలోనే రజత పతకం గెలుచుకున్నాను. మరుసటి ఏడాది జిల్లా స్థాయిలో రజతం, అనంతరం జరిగిన రాష్ట్ర స్థాయి ఈవెంట్‌లో రజతం, కాంస్యం సాధించాను. జాతీయ పోటీలకు ఎంపిక అయ్యాను.

అంతర్జాతీయ స్థాయికి...

ఎంతో ఉత్సాహంతో మొహలీలో జరిగిన జాతీయ స్థాయి రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొన్నాను. అయితే అనుకున్నంతగా రాణించలేకపోయినా... రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నాను. మెరుగైన ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాలని అర్థమయింది. ఏకాగ్రతతో సాధన చేశాను. 2022లో చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం నెగ్గాను. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కానీ అసలైన పరీక్ష నాకు న్యూజిలాండ్‌లో ఎదురైంది. గత ఏడాది జూన్‌లో అక్కడ నిర్వహించిన పసిఫిక్‌ ఓషియానా చాంపియన్‌షి్‌ప అండర్‌-14 విభాగంలో పోటీపడ్డాను. దీని కోసం భారత్‌ నుంచి 18 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. వారందరినీ దాటి నేనొక్కదాన్నే చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించాను. స్వర్ణ పతకం గెలుచుకున్నాను. అదే ఏడాది జాతీయ స్థాయి చాంపియన్‌షి్‌పలో రజతం నెగ్గాను. గడచిన నాలుగున్నరేళ్లలో పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లో పతకాలు సాధిస్తున్నాను.

బాల పురస్కార్‌...

2024 నా కెరీర్‌లోనే మరిచిపోలేని సంవత్సరం. న్యూజిలాండ్‌లో విజయం తరువాత ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌’ దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పురస్కారానికి ఎంపికైంది నేను ఒక్కదాన్నే అని తెలిసి ఎంతో గర్వంగా అనిపించింది. గత ఏడాది డిసెంబరు... ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును అందుకున్నా. అది నాకు ఎనలేని ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో జరిగిన తైవాన్‌ చాంపియన్‌షి్‌పలో సత్తా చాటాను. రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచాను. అంతేకాదు... గత నెల 24 నుంచి 29 వరకు దక్షిణ కొరియాలో నిర్వహించిన ఆసియా చాంపియన్‌షి్‌పలో రజత పతకం సాధించాను.

లక్ష్యం... ఒలింపిక్స్‌...

స్కేటింగ్‌లో నేను మరిన్ని అద్భుత విజయాలు అందుకోవాలని అమ్మానాన్న ఆకాంక్షిస్తున్నారు. దాంతోపాటు రన్నింగ్‌లో కూడా చాంపియన్‌గా ఎదగాలని నేను కోరుకొంటున్నాను. రెండిటినీ నెరవేర్చాలనే దృఢ సంకల్పం నాది. ప్రస్తుతం విజయవాడ ఎన్‌ఎ్‌సఎం స్కూల్లో పదో తరగతి చదువుతున్నా. చదువులో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించి... ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని అనుకొంటున్నా. అన్నిటికంటే పెద్ద లక్ష్యం... ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, పతకం సాధించడం. దాని కోసంమెరుగైన శిక్షణ తీసుకొంటున్నా. కఠోర సాధన చేస్తున్నా.’’

పి.దుర్గారావు

దెందులూరు

రన్నింగ్‌లో కూడా...

నా ప్రథమ ప్రాధాన్యం స్కేటింగ్‌కే. అలాగని రన్నింగ్‌ను వదిలేయలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి 100, 200, 400 మీటర్ల పరుగు పందేల్లో పాల్గొంటున్నాను. వాటిలో ఇప్పటికి 20 పతకాలు సాధించాను. స్కేటింగ్‌లో అయితే 56 పతకాలు నెగ్గాను. అందులో 23 స్వర్ణాలు, 22 రజతాలు ఉన్నాయి. నాతోపాటు మా తమ్ముడు జోయల్‌ ఆదర్శ్‌ కూడా స్కేటింగ్‌లో శిక్షణ తీసుకొంటున్నాడు. వాడికి టెక్నిక్స్‌ నేర్పుతున్నాను.

ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 05:38 AM