Stage Fear Tips: ఇలా చేస్తే స్టేజ్ ఫియర్ పరార్
ABN, Publish Date - Aug 20 , 2025 | 01:20 AM
మన కుండే అత్యంత పెద్ద భయం ‘మరణం’ కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనాల్లో మనకుండే ప్రఽధాన భయం ‘స్టేజ్ ఫియర్’ అని దాని తర్వాతిదే మరణ భయమని తేలింది. అయితే ఈ సమస్యను...
మన కుండే అత్యంత పెద్ద భయం ‘మరణం’ కానే కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిపిన అధ్యయనాల్లో మనకుండే ప్రఽధాన భయం ‘స్టేజ్ ఫియర్’ అని దాని తర్వాతిదే మరణ భయమని తేలింది. అయితే ఈ సమస్యను అధిగమించటం తేలికే! బహిరంగంగా మాట్లాడాలన్నా, వేదిక మీద ప్రసంగించాలన్నా కాళ్లు ఒణికి, చమటలు పట్టేస్తుంటే ఈ చిట్కాలు పాటించాలి.
వేదిక ఎక్కగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తి, కండరాలు పట్టేసి నర్వ్‌సగా ఫీలవుతాం. మాట్లాడబోతే నోట్లోంచి మాట పెగలదు. ఈ మార్పులన్నిటికీ కారణం టెన్షన్‌తో ఒంట్లో పెరిగిపోయే అడ్రినలిన్ హార్మోన్ ఫలితమే! అయుతే ఈ స్థితిని అఽధిగమించాలంటే వేదిక మీద నడుస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతో టెన్షన్ సద్దుమణిగి మామూలు స్థితికొస్తాం.
గుండెల్నిండా ఊపిరి పీల్చి వదలాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ పెరిగి గుండె వేగం తగ్గుతుంది. దాంతో ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మానసికి స్థితి మీద బాడీ లాంగ్వేజ్ ప్రభావం ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. కాబట్టి చిరునవ్వుతో స్నేహపూర్వకంగా కనిపించే ప్రయత్నం చేయాలి.
ఇష్టమైన విషయం గురించి మాట్లాడటం తేలిక. కాబట్టి వీలైనంతవరకూ నచ్చిన టాపిక్ ఎంచుకోవాలి.
ఏం మాట్లాడితే ఏమవుతుందో? ఏమనుకుంటారో? అనే ఆలోచనలను వదిలేయాలి. వాళ్లక్కడకు వచ్చింది మీ మాటలు వినటానికి...కాబట్టి ‘నా ప్రెజెంటేషన్ వాళ్లక నచ్చదు’ అని అనుకునే బదులు ‘ఎలాంటి విషయాలు చెప్తే ప్రేక్షకులకు ఉపయోగకరం?’ అనే దిశగా ఆలోచించండి.
పర్‌ఫెక్షన్ కోసం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ప్రెజెంటేషన్ స్ర్కిప్ట్ ముందుగానే తయారుచేసుకుని దాని గురించి అనుమానాలుంటే స్నేహితులతో చర్చించి నివృత్తి చేసుకోవాలి. చర్చించే సమయంలో ఏవైనా ప్రశ్నలు తలెత్తితే ప్రశ్నిస్తారు. తగిన సలహాలు సూచిస్తారు. అలాగే అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసినా ఫలితం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 20 , 2025 | 01:20 AM