ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pigeons Problem: పావురాళ్ల బెడద వదిలేలా

ABN, Publish Date - Sep 17 , 2025 | 01:44 AM

పావురాళ్లు నగర జీవితంలో భాగాలైపోయాయి. అవి మన బాల్కనీలు, కిటికీలు, ఎయిర్‌ కండిషర్‌ యూనిట్ల దగ్గర తిష్ఠ వేస్తూ విసర్జకాలతో, ఈకలు, గూళ్లతో పరిసరాలను పాడు చేస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యను...

పావురాళ్లు నగర జీవితంలో భాగాలైపోయాయి. అవి మన బాల్కనీలు, కిటికీలు, ఎయిర్‌ కండిషర్‌ యూనిట్ల దగ్గర తిష్ఠ వేస్తూ విసర్జకాలతో, ఈకలు, గూళ్లతో పరిసరాలను పాడు చేస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యను సులభమైన చిట్కాలతో పరిష్కరించుకునే వీలుంది. ఎలాగో తెలుసుకుందాం!

ప్రొటెక్టివ్‌ నెట్స్‌: అత్యంత ప్రభావవంతమైన విధానమిది. ప్రత్యేకించి ఎత్తైన నిర్మాణాలకు ఇదే అనువైన పద్ధతి. బాల్కనీ మూలలు, ఎసి యూనిట్లు, ఇతరత్రా ఆశ్రయానికి వీలుండే జాగాల నుంచి పావురాళ్లను దూరం పెట్టడం కోసం ఈ నెట్స్‌ వాడుకోవచ్చు. అయితే పావురాళ్లు పొరపాటున ఈ వలల్లో చిక్కుబడిపోకుండా ఉండడం కోసం, నెట్‌ను బిగుతుగా లాగి కట్టేయాలి.

ప్రతిఫలించే వస్తువులతో: పావురాళ్లు అకస్మాత్తుగా కదిలే వస్తువులు, ప్రతిఫలించే వెలుగులకు దూరంగా ఉంటాయి. కాబట్టి పాత సిడిలు, విండ్‌ చైమ్స్‌ లేదా ప్రతిఫలించే టేప్‌ లాంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అద్దాలతో కూడా ప్రయోజనం ఉంటుంది.

సహజసిద్ధ రిపెల్లెంట్స్‌: ఘాటు వాసన వెదజల్లే వాసనలు కూడా పావురాళ్లను దూరం పెడతాయి. లవంగ నూనె, పుదీనాతో తయారైన స్ర్పేలు, పలుచన చేసిన మిరప సారాలను బాల్కనీ ఉపరితలాలకు అప్లై చేయాలి. సాధారణంగా పావురాళ్లు వానాకాలం ప్రారంభంలో లేదా వసంతకాలంలో గూళ్లు పెట్టడం మొదలుపెడతాయి. కాబట్టి అంతకంటే ముందే ఈ జాగ్రత్తలకు పూనుకోవాలి.

ఆహారం వద్దు: పావురాళ్లకు ఆహారం అందించడం మొదట్లో సరదాగానే ఉంటుంది. కానీ ఈ పని మరిన్ని పావురాళ్లను ఆకర్షిస్తుంది. కాబట్టి పావురాళ్లకు నీళ్లు, ఆహారం అందుబాటులో ఉంచడం మానుకోవాలి. పావురాళ్లతో పాటు వాటి వెంట పరాన్నజీవులు కూడా ఇళ్ల పరిసరాల్లోకి చేరుకుని, ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఇవి కూాడా చదవండి..

సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు

డెహ్రాడూన్‌ను ముంచెత్తిన వానలు..నీట మునిగిన షాపులు, ఆలయాలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 17 , 2025 | 11:52 AM