Attractive Personality: ఇలా ఉంటే అందరినీ ఆకట్టుకుంటారు
ABN, Publish Date - Sep 14 , 2025 | 05:46 AM
చక్కని మాట తీరు, ఆకట్టుకునే వ్యక్తిత్వం అనేవి మనల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అలా అందరితో ప్రశంసలు అందుకోవాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...
చక్కని మాట తీరు, ఆకట్టుకునే వ్యక్తిత్వం అనేవి మనల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. అలా అందరితో ప్రశంసలు అందుకోవాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...
ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముఖంపై చిరునవ్వు ఉండేలా చూసుకోవాలి. అలాగే నిటారుగా నిలబడాలి లేదా కుర్చీలో హాయిగా కూర్చోవాలి. అక్కడా ఇక్కడా కాకుండా ఎదుటివారి కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. ఇవన్నీ చక్కని ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి.
దుస్తులు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఆహ్లాదకరంగా కనిపిస్తూ అభిరుచికి అద్దం పట్టేలా దుస్తులు ఉండాలి. సందర్భానుసారం దుస్తులను ఎంపిక చేసుకోవాలి. సరైన దుస్తులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
అనుకోని సమస్య ఎదురైనప్పుడు ఇతరులను నిందించకూడదు. దానికి బదులు సమస్య పరిష్కారానికి మనం అనుసరించే వ్యవహారశైలి అందరిలో ఉన్నతంగా నిలబెడుతుంది. అనవసరమైన వాదనలకు పోకుండా సామరస్యంగా సమస్యను తీర్చే ప్రయత్నం చేయాలి.
సొంత ఆలోచన మాత్రమే సరైనదన్న భావనతో కాకుండా అందరి అభిప్రాయాలను తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. అందరినీ కలుపుకొంటూ, ఏ ఒక్కరినీ నొప్పించకుండా చక్కని వ్యవహార దక్షతను అవలంభిస్తే నలుగురిలో ప్రత్యేకమైన ప్రశంసలు అందుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
Updated Date - Sep 14 , 2025 | 05:46 AM