Mouth Ulcer Remedies: నోటి పూత తగ్గేదెలా
ABN, Publish Date - Aug 25 , 2025 | 01:05 AM
శరీరంలో పోషకాలు తగ్గితే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. కొందరికి తరచూ ఈ సమస్య తలెత్తుతుంది. దీని వలన తినడానికి, తాగడానికే కాదు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది...
శరీరంలో పోషకాలు తగ్గితే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. కొందరికి తరచూ ఈ సమస్య తలెత్తుతుంది. దీని వలన తినడానికి, తాగడానికే కాదు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీని నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
తేనెలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటిపూత నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి నోటిలో పుండ్లకు తేనె రాయాలి.
కొబ్బరి నీరు తాగడం వలన కూడా నోటి పూతను తగ్గించుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె రాయడం, కొబ్బరి నమలడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది.
నోటి అపరిశుభ్రత వలన కూడా నోటి పూత వస్తుంది. కాబట్టి ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి.
నోటి పూతకు ఓ ముఖ్య కారణం బి విటమిన్ లోపం. కాబట్టి బి విటమిన్, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 25 , 2025 | 01:05 AM