Share News

CM Revanth Reddy in Biodesign Innovation: లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 24 , 2025 | 07:34 PM

తెలంగాణ లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. తాము తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy in Biodesign Innovation: లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy Participate in Biodesign Innovation

హైదరాబాద్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): తెలంగాణ లైఫ్ సైన్సెస్‌కు కేంద్రంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉద్ఘాటించారు. తాము తెలంగాణ రైజింగ్ -2047 (Telangana Rising-2047) అనే ప్రయాణాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణ‌ను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామని తెలిపారు. దేశం 100 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని జరుపుకునే 2047 నాటికి తెలంగాణ‌ను మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థగా మారుస్తామని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లో బ‌యోడిజైన్ ఇన్నోవేష‌న్ స‌మ్మిట్ 2025 స‌ద‌స్సులో (Biodesign Innovation 2025 Summit ) సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ - ది బయోడిజైన్ బ్లూప్రింట్‌ను సీఎం ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. బయోడిజైన్ ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల స‌ద‌స్సులో పాల్గొన‌డం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. దేనినైనా మ‌నం రూపొందిస్తే దాని ప్రయోజ‌నం, ప‌నితీరు, రూపం ప్రాథ‌మిక అంశాలుగా ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంలోని కీలక అంశాలు..

  • దేవుడు గొప్ప డిజైనర్. ప్రకృతి ఉత్తమ గురువు.

  • మనం మంచి విద్యార్థుల‌మా లేదా అన్న‌దే ప్ర‌శ్న‌.

  • లైఫ్ సైన్సెస్‌లో, వైద్యంలో, ప్రకృతి ఉత్తమ గురువు.

  • మనం ప్రకృతి నుంచి నేర్చుకుంటే, మనం తప్పు చేయొద్దు.

  • కృత్రిమ మేథస్సు బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ .

  • మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించారు.

  • తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్‌టెక్ కీలకమైనవి.


  • ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్ , మెడ్‌టెక్ వంటివి హైద‌రాబాద్‌లో అత్యంత కీల‌క‌మైన‌వి.

  • తయారీ రంగం నుంచి ఆవిష్కరణల‌కు కేంద్రంగా తెలంగాణ‌ను మారుస్తున్నాం.

  • సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ పార్క్‌ను ఏర్పాటు చేశాం.

  • ఈ పార్క్‌లో ప‌రిశోధ‌న , పరీక్ష‌, తయారీ కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తున్నాం.

  • ఇక్కడ 60కి పైగా దేశీయ‌, అంత‌ర్జాయతీయ కంపెనీలు ప‌నిచేస్తున్నాయి.

  • డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయి.

  • స్థానిక స్టార్టప్‌లు, MSMEలు గ్లోబల్ కంపెనీలతో పాటు క‌లిసి ప‌నిచేస్తున్నాయి.


  • సామాన్య ప్రజల సమస్యల ప‌రిష్కారం కోసం పరిశోధనలు నిర్వహిస్తున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి , AIG హాస్పిట‌ల్‌ను అభినందిస్తున్నాను.

  • చాలా ఏళ్లుగా మ‌న మేథ‌స్సుని ఇత‌ర దేశాల ప్ర‌జ‌ల కోసం ఉప‌యోగిస్తున్నాం.. ఇప్పుడు మ‌న ప్ర‌జ‌ల మంచి కోసం ప‌నిచేయాల్సిన స‌మ‌యం వ‌చ్చింది.

  • మా ప్ర‌భుత్వం నుంచి పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంది.

  • అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని అందిస్తాం.

  • డేటా గోప్య‌తను పాటిస్తూనే ఇక్క‌డ ప్ర‌జ‌ల వైద్య‌స‌హాయం కోసం అవ‌స‌ర‌మైన డేటాను అందజేస్తాం.

  • స్కిల్ యూనివ‌ర్సిటీ, కార్పొరేష‌న్లు, విద్యా సంస్థ‌లు, రీసెర్చ్ సెంట‌ర్స్‌తో అనుసంధానం చేస్తాం.

  • ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అనిశ్చిత ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

  • ప‌న్నులు, యుద్ధాలు, వాణిజ్య‌ప‌ర‌మైన అడ్డంకులు వంటివి ఎదుర‌వుతున్నాయి.

  • ఈ స‌మ‌యంలో ఆవిష్కరణలు చేయడానికి స‌రైన వేదిక తెలంగాణ‌.

  • మాన‌వాళిని మ‌రింత ఆరోగ్యంగా మార్చ‌డానికి మ‌నంద‌రం ప్ర‌య‌త్నం చేద్దాం.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడత పెట్టి కొట్టే రోజులు త్వరలో: కేటీఆర్

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

For More Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 07:49 PM