Share News

Fire Accident in Telangana: తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:43 PM

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో గల ప్లైవుడ్ గోడౌన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లైవుడ్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అగ్ని ప్రమాదం సంభవించింది.

 Fire Accident in Telangana: తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
Fire Accident in Telangana

హైదరాబాద్, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): మైలార్‌దేవ్‌పల్లి (Mailardevpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో గల ప్లైవుడ్ గోడౌన్‌లో ఇవాళ(ఆదివారం) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ప్లైవుడ్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.


ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే గోడౌన్‌లో ఉన్న లక్షల విలువైన సామాగ్రి కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

For More Telangana News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 08:45 PM