ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Reduce Spice In Curry: కూరలో కారం ఎక్కువైందా

ABN, Publish Date - Aug 13 , 2025 | 12:38 AM

ఒక్కోసారి కూరలో కారం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చిన్న చిట్కాలు పాటించి కూరను సరిచేయవచ్చు....

ఒక్కోసారి కూరలో కారం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చిన్న చిట్కాలు పాటించి కూరను సరిచేయవచ్చు.

  • కూర ఉన్న గిన్నెను స్టవ్‌ మీద పెట్టి రెండు నిమిషాలు వేడిచేయాలి. ఇందులో ఒక చెంచా శనగపిండి, కొన్ని నీళ్ల చుక్కలు చల్లి కలిపితే కారం తగ్గుతుంది. చివరలో ఉప్పు సరిచూసుకోవాలి.

  • కూరలో ఒక చెంచా వెనిగర్‌ లేదంటే నిమ్మరసం కలిపితే కారం తగ్గుతుంది. కొద్దిగా చింతపండు గుజ్జు కలిపినాకూడా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • ఒక ఆలుగడ్డను ఉడికించి తొక్క తీసి వేళ్లతో చిదిమి కూరలో వేసి కలిపితే కారం తగ్గుతుంది. చిటికెడు ఉప్పు చల్లితే కమ్మని రుచి వస్తుంది.

  • సన్నగా తరిగిన కేరట్‌ ముక్కలు లేదంటే కొన్ని పచ్చి బఠాణీలు వేసి కొన్ని నీళ్లు చల్లి అయిదు నిమిషాలు కూరని ఉడికిస్తే కారం తగ్గుతుంది.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి ఒక చెంచా నూనె వేసి వేడిచేయాలి. రెండు టమాటాలను సన్నగా తరిగి అందులో వేసి కలపాలి. చిటికెడు ఉప్పు చల్లి మగ్గనివ్వాలి. తరవాత చల్లార్చి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని కూరలో కలిపితే కారం తగ్గి చక్కని రుచి వస్తుంది.

  • కొత్తిమీర, చుక్కకూర లేదంటే పాలకూర ఆకులను సన్నగా తరిగి కూరలో కలిపి స్టవ్‌ మీద పెట్టి అయిదు నిమిషాలు మగ్గిస్తే కారం తగ్గుతుంది.

  • కొబ్బరి పాలు, వెన్న, పాల మీగడ, పెరుగు, పచ్చి కొబ్బరి తురుం, పుట్నాలపప్పు పొడి, బ్రెడ్‌ ముక్కలు, పన్నీరు ముక్కలు లాంటివి వేసి కలిపినా ప్రయోజనం ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 12:38 AM