Wedding Saree Styles: కళ్లు చెదిరే కాంతల్లా
ABN, Publish Date - Sep 03 , 2025 | 02:30 AM
వేడుకల్లో వెలిగిపోయేలా బంగారు, వెండి జరీ ధగధగలు, కలనేతల కళాకాంతులు సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం పలు రకాల పట్టు చీరలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో కొన్నిటి మీద...
ఫ్యాషన్
వేడుకల్లో వెలిగిపోయేలా బంగారు, వెండి జరీ ధగధగలు, కలనేతల కళాకాంతులు సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం పలు రకాల పట్టు చీరలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో కొన్నిటి మీద ఓ లుక్కేద్దామా?
చామంతులు, కనకాంబరాలు కలిపి కట్టిన పూమాలలా కనిపించాలంటే పవిట చెంగు, కుచ్చిళ్లు ఒక రంగు లో, చీర మొత్తం మరో రంగులో ఉండాలి. అలాంటి కాంట్రాస్ట్ రంగుల్లోనే చీర భారీగా కనిపించి కనువిందు చేస్తుంది.
తెల్ల పట్టుచీర హూందాతనమే వేరు. ప్రింటెడ్ డిజైన్ మోడర్న్ లుక్‌ని తెచ్చిపెడితే, కాంట్రాస్ట్ జరీ బార్డరు చీర మొత్తానికే వన్నె తెస్తుంది.
వెండి వెలుగులు విరజిమ్మాలంటే వెండి జరీలో ధగధగలాడాలి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే వెండి జరీ చీరను ఎంచుకుంటే సరి!
కుచ్చిళ్ల దగ్గర జరీ బార్డరు మోకాళ్ల వరకూ ఉండడం తాజా ఫ్యాషన్! ఈ స్టయిల్ చీరకు వినూత్న ఆకర్షణను తెచ్చిపెడుతుంది. జరీ మీద కనిపించీ, కనిపించకుండా ఉండే సెల్ఫ్ డిజైన్ చీరకే వన్నె తెస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..
సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర
For More National News
Updated Date - Sep 03 , 2025 | 02:30 AM