Share News

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:25 PM

బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు.

CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

- ఎన్‌ఐఏ దర్యాప్తు అవసరం లేదు: సీఎం

బెంగళూరు: బీజేపీ చేపట్టిన చలో ధర్మస్థల.. అదొక రాజకీయ యాత్ర అని, తద్వారా ఎలాంటి లాభం లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. కేవలం వారు రాజకీయలబ్ధికోసమే యాత్ర చేశారన్నారు. మైసూరు(Mysoor)లో మీడియాతో మాట్లాడిన ఆయన ధర్మస్థల, చాముండి కొండలు, దసరా ఉత్సవాల విషయంలో బీజేపీ(BJP) బూటకపు నిరసన సాగిస్తోందన్నారు. హిందువులను ఆకర్షించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే అది తప్పు అని గుర్తిస్తారన్నారు. ధర్మస్థల పట్ల మాకు అపారమైన గౌరవం ఉందన్నారు.


pandu4.2.jpg

సిట్‌ ఏర్పాటు చేసినప్పుడు వ్యతిరేకించని బీజేపీ, ఇప్పుడు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందన్నారు. తానూ ఓ హిందువేనని, మా పల్లెలో రామమందిరం నిర్మించలేదా అన్నారు. బాను ముస్తాక్‌ ఓ కన్నడ రచయిత్రి అని, అంతర్జాతీయస్థాయిలో గౌరవం పొందారని, ఆమెతో దసరా ఉత్సవాలు ప్రారంభించడంలో తప్పేముందన్నారు. చాముండి కొండలు హిందువుల ఆస్తి అనుకున్నా దసరా పండుగ నాడహబ్బ (రాష్ట్ర పండుగ) అని అందరూ కలసి జరుపుకొనే వేడుక అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యానికి తీపి కబురు

పడిగాపులు.. తోపులాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 02 , 2025 | 12:25 PM