ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Islamic Prayer: శ్రేయస్సు శుభాల కోసం

ABN, Publish Date - Aug 29 , 2025 | 12:41 AM

మానవ జీవితం అంటేనే అనేక సంఘటనల సమాహారం. ఒక్కోసారి శుభాలు జరుగుతాయి. అశుభాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎటువంటి చెడు లేకుండా జీవితం సజావుగా సాగాలని దేవుణ్ణి ప్రార్థించాలి. దానికోసం ‘ఇస్తిఖారా’ చేయాలని పెద్దలు...

సందేశం

మానవ జీవితం అంటేనే అనేక సంఘటనల సమాహారం. ఒక్కోసారి శుభాలు జరుగుతాయి. అశుభాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎటువంటి చెడు లేకుండా జీవితం సజావుగా సాగాలని దేవుణ్ణి ప్రార్థించాలి. దానికోసం ‘ఇస్తిఖారా’ చేయాలని పెద్దలు నిర్దేశించారు. ‘ఇస్తిఖారా’ అంటే... ‘శ్రేయస్సును, శుభాలను, మేలును అర్థించడం’ అని అర్థం. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ప్రయాణం... ఇలా అన్ని విషయాల్లో ఇస్తిఖారా చేస్తూ ఉండాలి. అయితే మన కోరిక ధర్మసమ్మతమై ఉండాలి. ఉదాహరణకు... ఒక వ్యక్తి తనకు మంచి ఉద్యోగం దొరకాలని ఇస్తిఖారా చేశాడు. అతనికి ఉద్యోగం వచ్చింది. కానీ దాన్ని దైవం తనకు అనుగ్రహించిన మహా ప్రసాదంగా సంతృప్తి చెందడు. ఆ ఉద్యోగం కష్టంగా ఉందని మనసులో మధనపడుతూ ఉంటాడు. కొన్నాళ్ళకు పదోన్నతులతో పెద్ద స్థాయికి చేరుకుంటాడు. అప్పుడు అతను తృప్తి పడవచ్చు. కానీ మొదట్లో కష్టపడకుండా ఆ స్థితికి రాలేడు కదా! దైవానికి ఎవరికి ఏ సమయంలో ఏ విధంగా సాయం అందించాలో తెలుసు. కానీ మనిషికి సహనం ఉండదు. తనకు మేలు జరిగితే ఆనందిస్తాడు. లేకుంటే దేవుణ్ణి నిందిస్తాడు. ఇది సాధారణమైన మానవ స్వభావం. అలాంటి వైఖరిని విడిచిపెట్టి... అంతా దైవ నిర్ణయమేనని భావించినవారే ఆనందంగా ఉంటారు.

‘‘ఒక పని చెయ్యాల్సి వస్తుంది. అది మనకు ఎంత మేలు చేస్తుందనేది స్పష్టంగా తెలీదు. అప్పుడు తప్పనిసరిగా ఇస్తిఖారా పాటించాలి. దీనికోసం ముందుగా రెండు విడతలు నఫిల్‌ నమాజ్‌ చేయాలి. తరువాత ఇస్తిఖారా ‘దుఆ’ (ప్రార్థన) పఠించాలి. ఆ తరువాత మన హృదయం ఎటువైపు ఆకర్షితం అవుతుందో... దాన్నే దైవ నిర్ణయంగా భావించి అనుసరించాలి. ఇస్తిఖారా చేసే వ్యక్తి ఎన్నటికీ విఫలం కాడు. ప్రతి పని చేసే ముందు దైవనామంతో దాన్ని ప్రారంభిస్తే... ఆ కార్యం తప్పకుండా విజయవంతం అవుతుంది’’ అని ఇస్లాం ధర్మం చెబుతోంది. ‘‘దైవ ప్రవక్త మహమ్మద్‌ మాకు ఏ విధంగానైతే ఖుర్‌ఆన్‌ బోధించేవారో... అదే విధంగా ప్రతి పనిలో ‘ఇస్తిఖారా’ ప్రార్థన చేయడం గురించి కూడా చెప్పేవారు. ‘‘మీలో ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి సందిగ్ధంలో ఉంటే... వారు రెండు విడతలు నఫిల్‌ నమాజ్‌ చేసి తరువాత ప్రార్థన చేయాలి’’ అని వివరించేవారు. సరైన నిర్ణయం తీసుకోలేని సమయాల్లో... దేవునిపైనే భారం వేసి, నిర్ణయాన్ని ఆయనకే వదిలిపెడితే... పరిష్కారమార్గాన్ని కచ్చితంగా నిర్దేశిస్తాడు’’ అని మహనీయుడైన హజ్రత్‌ జాబిర్‌ స్పష్టం చేశారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఇవి కూడా చదవండి

ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..

రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..

Updated Date - Aug 29 , 2025 | 01:03 AM