ఇవి అతిగా తింటే అనర్థమే
ABN, Publish Date - Jun 30 , 2025 | 03:49 AM
గుమ్మడి గింజల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. అయితే ఏదైనా సరే అతిగా తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుంది. గుమ్మడి గింజలు కూడా...
గుమ్మడి గింజల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. అయితే ఏదైనా సరే అతిగా తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుంది. గుమ్మడి గింజలు కూడా అంతే. వీటిని అతిగా తినడం ఆరోగ్యానికి చేటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలివీ..
గుమ్మడి గింజల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. అయితే ఈ గింజలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్, డయేరియా సమస్యలు తలెత్తుతాయి.
ఈ విత్తనాల్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
గుమ్మడి గింజలు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. కాట్టి లోబీపీ ఉన్న వారు ఎక్కువగా తీసుకుంటే నీరసంతో అనారోగ్యం బారిన పడతారు.
ఇవి తింటే కొందరికి చర్మంపై దురద, దద్దుర్లు వంటి అలర్జీలు రావచ్చు.
ఇక చిన్న పిల్లలకు గుమ్మడి గింజలు ఇచ్చేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు వాటిని నమిలి మింగేలా చూడాలి. లేకపోతే గొంతులో ఇరుక్కుని ఇబ్బంది పడే అవకాశముంటుంది.
Also Read:
యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...
For More Telugu News
Updated Date - Jun 30 , 2025 | 03:49 AM