Winter Skin Care: దురద తగ్గుతుంది
ABN, Publish Date - Nov 24 , 2025 | 05:30 AM
శీతాకాలంలో వీచే చల్లటి గాలుల వల్ల చర్మం పొడిబారి దురద మొదలవుతుంది. చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించుకోవచ్చు.
ఇలా చేస్తే
శీతాకాలంలో వీచే చల్లటి గాలుల వల్ల చర్మం పొడిబారి దురద మొదలవుతుంది. చిన్నపాటి జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించుకోవచ్చు.
చలిగా ఉందంటూ వేడివేడి నీళ్లతో స్నానం చేయకూడదు. స్నానానికి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే గ్లిజరిన్ సోప్‌ను వాడితే ప్రయోజనం ఉంటుంది.
చర్మం మీద పేరుకున్న మురికిని తొలగించడంలో ఓట్‌మీల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఓట్‌మీల్ కలుపుకోవడం మంచిది. లేదంటే దురద అనిపించిన చోట కొద్దిగా ఓట్‌మీల్ పేస్ట్ రాసి ఆరిన తరువాత చేతి వేళ్లతో రుద్దితే సరిపోతుంది.
స్నానం చేసిన తరువాత ఒళ్లంతా కొద్దిగా కొబ్బరినూనె లేదా బాదం నూనె రాసుకుంటే సమస్య తీరుతుంది. దురదగా అనిపించిన చోట కలబంద జెల్ లేదా షియా బటర్‌తో మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది.
చిన్న గిన్నెలో అయిదు చెంచాల కొబ్బరినూనె, మూడు చెంచాల మింట్ ఆయిల్(పుదీనా నూనె) వేసి బాగా కలపాలి. రాత్రి పడుకునేముందు ఒళ్లంతా ఈ నూనె రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం తేమతో నిండి మృదువుగా మారుతుంది. దురద కూడా తగ్గుతుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి ఒక చెంచా నీళ్లు చిలకరించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దురద ఎక్కువగా ఉన్నచోట రాసి పది నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దురద వెంటనే తగ్గుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూ బెర్రీ, టమాటా, కేరట్, బీన్స్, బఠానీలు, పప్పు దినుసులు, చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అల్లం, దాల్చినచెక్క, మిరియాలు లాంటి దినుసులతో తయారుచేసిన హెర్బల్ టీలు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగి దురద సమస్య తగ్గుతుంది.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 24 , 2025 | 05:30 AM