Raksha Bandhan: ఆ బంధం ఒక పవిత్ర శక్తి
ABN, Publish Date - Aug 08 , 2025 | 02:26 AM
‘‘ఆధ్యాత్మిక ప్రయాణంలో మానవ సంబంధాలు అతి ముఖ్యమైనవి. మానవ సమాజాన్ని పూర్తిగా విడిచిపెట్టి, అడవులలోకి వెళ్ళి, ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం జపిస్తే భగవంతుడి సాక్షాత్కారం లభిస్తుందని చాలామంది అనుకుంటూ...
సహజయోగ
రేపు శ్రావణ పౌర్ణమి
‘‘ఆధ్యాత్మిక ప్రయాణంలో మానవ సంబంధాలు అతి ముఖ్యమైనవి. మానవ సమాజాన్ని పూర్తిగా విడిచిపెట్టి, అడవులలోకి వెళ్ళి, ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం జపిస్తే భగవంతుడి సాక్షాత్కారం లభిస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ సంఘంలో అందరితో కలిసి జీవిస్తూ, పవిత్రమైన మానవ సంబంధాలను ఆనందించినప్పుడే ఆత్మసాక్షాత్కారం త్వరగా, మరింత సులభంగా లభిస్తుందంటారు’’ శ్రీమాతాజీ నిర్మలాదేవి.
రాఖీ... చూడడానికి కేవలం ఒక దారపుపోగే కానీ... దాని విలువ వెలకట్టలేని మమతల పెన్నిధి. పవిత్రమైన సోదరీ సోదర బంధానికి అది ప్రతీక. మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అనుబంధం ఈ బంధం గొప్పతనాన్ని చాటిచెబుతుంది. నిండు సభలో... దుర్యోధనుడి ప్రోద్బలంతో ద్రౌపదీ వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నించినప్పుడు... ద్రౌపది చేసిన ఆర్తనాదానికి... ఎక్కడో ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు వచ్చి, ఆమె మర్యాదను కాపాడిన కథ ప్రసిద్ధమైనది. ద్రౌపదిపై శ్రీకృష్ణుడికి ఉన్న సోదరీ ప్రేమకు ఇది నిదర్శనం. అలాగే... చరిత్రలో మరో ఉదంతం ఉంది. భారతదేశంపై దండెత్తి వచ్చిన అలెగ్జాండర్‌ను పురుషోత్తముడనే రాజు బంధిస్తాడు. భారతీయ సంప్రదాయాల గురించి తెలిసిన అలెగ్జాండర్ భార్య ఒక రాఖీని పురుషోత్తముడికి బహుమతిగా పంపిస్తుంది. వెంటనే అలెగ్జాండర్‌ను పురుషోత్తముడు చెర నుంచి విడుదల చేస్తాడు. పురుషోత్తమునిలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పునకు కారణం... తన భార్య పంపిన రాఖీ అని తెలుసుకున్న అలెగ్జాండర్ ఆశ్చర్యపోతాడు. సంస్కృతి సంప్రదాయాలకు, సోదర సోదరీ బంధానికి భారతీయులు ఇచ్చే విలువను గ్రహిస్తాడు. రక్షాబంధన్ ప్రాశస్త్యం గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి వివరించిన మరో సంఘటన ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించినది.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
For More Telangana News And Telugu News
తానాజీ వీరత్వం...
సింహగఢ్ రాజకుమారి కమలకుమారి నుంచి శివాజీ తల్లి జిజియాబాయికి ఒక లేఖ అందుతుంది. శివాజీని తన సోదరుడిగా కమలకుమారి సంబోధిస్తూ... తను ఆపదలో ఉన్నానని, తనను రక్షించాలని కోరుతుంది. మరునాటి సూర్యోదయం లోపున తనను కాపాడకపోతే... శత్రువుల వల్ల తన మానప్రాణాలకు ప్రమాదం అని తెలుపుతూ... ఒక రాఖీని కూడా పంపుతుంది. వెంటనే శివాజీని తన వద్దకు పిలిపించుకున్న జిజియాబాయి... మరునాడు ఉదయం లోపల సింహగఢ్ కోటను జయించాలని ఆదేశిస్తుంది. ఆ బాధ్యతను తన సైన్యంలో ప్రముఖుడైన తానాజీకి శివాజీ అప్పగిస్తాడు. కమలకుమారి పంపిన రాఖీ గురించి విన్న తానాజీ ఒక్క రాత్రిలో ఆ కోటను జయిస్తాడు. అయితే యుద్ధం ముగిసేసరికి వీరమరణం పొందుతాడు. రాఖీకి విలువను ఇచ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన తానాజీ వీరత్వం భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమయింది.
ఎన్నో సమస్యలకు పరిష్కారం...
మానవుల సంఘ జీవితాన్ని వారి సూక్ష్మ శరీరంలోని విశుద్ధ చక్రం నిర్దేశిస్తుంది. అందరితో పవిత్రమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండి, వాటిని ఆనందించేవారిలో ఈ చక్రం ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల మనిషి తన జీవితంలో ఎదురయ్యే రకరకాల ఒడుదొడుకులను తట్టుకొని నిలిచే స్థితప్రజ్ఞత పొందుతాడు. ‘‘ఈ స్థితికి చేరాలంటే... స్త్రీ పురుషులు తమ జీవిత భాగస్వాములను తప్ప మిగిలినవారి పట్ల సోదర-సోదరీభావం కలిగి ఉండాలి. అటువంటి పవిత్రమైన మానవ సంబంధాలు స్థిరపడినప్పుడే నేటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’’ అని వెల్లడించారు శ్రీ మాతాజీ. మన అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలోని విశుద్ధ చక్రంలో ఎడమవైపున.. సోదరి తత్త్వానికి ప్రతీకగా శ్రీవిష్ణుమాయ నెలకొని ఉంటుంది. అందుకే సహజయోగ ధ్యాన సాధన చేస్తున్న ప్రతిఒక్కరూ ఈ సోదర, సోదరీ బంధాన్ని పవిత్ర శక్తిగా భావిస్తారు. తమ దైనందిన జీవితంలో దానికి అనుగుణంగా నడుచుకుంటారు. రాఖీ పండుగను ప్రపంచవ్యాప్తంగా... సామూహికంగా జరుపుకొంటారు.
మానవుల సంఘ జీవితాన్ని వారి సూక్ష్మ శరీరంలోని విశుద్ధ చక్రం నిర్దేశిస్తుంది. అందరితో పవిత్రమైన సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండి, వాటిని ఆనందించేవారిలో ఈ చక్రం ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల మనిషి తన జీవితంలో ఎదురయ్యే రకరకాల ఒడుదొడుకులను తట్టుకొని నిలిచే స్థితప్రజ్ఞత పొందుతాడు.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
Updated Date - Aug 08 , 2025 | 02:26 AM