Professor Kiran for Disabled Students: ఈ అంధ ప్రొఫెసర్... దివ్యాంగ విద్యార్థుల మార్గదర్శి
ABN, Publish Date - Oct 30 , 2025 | 02:45 AM
19 ఏళ్లకే కంటిచూపు కోల్పోతే అక్కడితో జీవితం ముగిసి పోయిందని నిరుత్సాహ పడలేదు, చదువును ఆపేయలేదు. రెట్టింపు పట్టుదలతో అంచెలంచెలుగా విద్యార్హతలు పెంచుకుంటూ దివ్యాంగ మహిళల గుర్తింపు కోసం...
స్ఫూర్తి
19 ఏళ్లకే కంటిచూపు కోల్పోతే అక్కడితో జీవితం ముగిసి పోయిందని నిరుత్సాహ పడలేదు, చదువును ఆపేయలేదు. రెట్టింపు పట్టుదలతో అంచెలంచెలుగా విద్యార్హతలు పెంచుకుంటూ దివ్యాంగ మహిళల గుర్తింపు కోసం కృషికి తోడ్పడే ప్రాజెక్టును సొంతం చేసుకుంది పంజాబ్‌కు చెందిన కిరణ్. ఆమె గురించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు...
ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసిఎ్‌సఎ్‌సఆర్) పాటియాలా... పంజాబ్ యూనివర్శిటీకి చెందిన దృష్టి లోపం కలిగిన మహిళా ప్రొఫెసర్‌కు ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును ప్రదానం చేసింది. దీనికిగాను విద్యా మంత్రిత్వ శాఖ 15 లక్షల గ్రాంటును మంజూరు చేయడం విశేషం.
15 లక్షల గ్రాంట్‌తో...
పంజాబ్‌లో దివ్యాంగ మహిళల గుర్తింపుపై మీడియా, సంస్కృతుల ప్రభావాన్ని అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. దృష్టి లోపంతో అనుభవపూర్వకంగా తానెదుర్కొన్న ఇబ్బందులు, అవరోధాలను సాటి దివ్యాంగ మహిళలు ఎదుర్కోకూడదనే ఆలోచనతో, వారి పట్ల మీడియా, సంస్కృతుల ధృక్పథాన్ని మార్చాలనే సంకల్పంతో, పంజాబ్‌కు చెందిన కిరణ్ నడుం బిగించింది. కిరణ్.... ఈ ప్రాజెక్టు గురించి వివరిస్తూ, భారతదేశ విద్యా మంత్రిత్వ శాఖ మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా ఇప్పటికే 40 శాతం గ్రాంట్‌ను విడుదల చేసిందనీ, దివ్యాంగ మహిళల పురోగతికి తన అధ్యయనం ఎంతో బాగా తోడ్పడుతుందనీ అంటోంది. సాటి దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలనే ఆలోచనతో కిరణ్ ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుకు పూనుకోవడం వెనక ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే...
దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రం
బిఎ్‌ససి నర్సింగ్ చదువుతున్న సమయంలో కిరణ్, ఒక వ్యాధి కారణంగా కంటి చూపు కోల్పోయింది. కానీ అంతటితో జీవితం ముగిసిపోయిందని ఆమె భావించలేదు. బ్రెయిలీలో ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ చదివి, చండీఘర్, పంజాబ్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత సోషియాలజీలో మాస్టర్స్‌లో, విశ్వవిద్యాలయంలో రెండో ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించింది. అక్కడితో ఆగిపోకుండా యుజిసి నెట్‌లో ఉత్తీర్ణురాలై, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారింది. ఆ తర్వాత దృష్టి లోపంస్పెషలైజేషన్‌తో పిహెచ్‌డి కూడా పూర్తి చేసింది. అలా కిరణ్, యూనివర్శిటీలోని సోషల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాకల్టీ మెంబర్‌గా మారింది. సోషియాలజీ, ఆంథ్రొపాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పని చేసింది. అలాగే అదే యూనివర్శిటీలో, సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ్‌సకు డైరెక్టర్‌గా బాద్యతలు కూడా నిర్వహించింది. 2018లో పంజాబ్ ప్రభుత్వ వికలాంగుల సలహా బోర్డులో సభ్యురాలిగా నామినేట్ అయినప్పుడు, అవయవలోపాల మూలంగా ఇబ్బందులను ఎదుర్కొనే విద్యార్థులు స్వయంస్వావలంబన సాధించేలా, విశ్వవిద్యాలయ ఆవరణలోనే ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అలా 2021లో, ఆ ప్రతిపాదనను అంగీకరించిన ప్రభుత్వం, పంజాబ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే ఒక ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పడం విశేషం.
అవయవ లోపాలు కలిగిన వ్యక్తులు, ఉన్నత విద్యను అభ్యసించడానికి పుష్కలమైన మార్గాలను కలిగి ఉండడంతో పాటు, మెరుగైన మార్గనిర్దేశాన్ని పొందడం కూడా అవసరమే! కిరణ్ తాజా ప్రాజెక్టు, దివ్యాంగుల విద్యార్హతల పెంపుదలకూ, జీవన ప్రమాణాల మెరుగుదలకూ తోడ్పడాలని కోరుకుందాం!
2018లో పంజాబ్ ప్రభుత్వ వికలాంగుల సలహా బోర్డులో సభ్యురాలిగా కిరణ్ నామినేట్ అయినప్పుడు, అవయవలోపాల మూలంగా ఇబ్బందులను ఎదుర్కొనే విద్యార్థులు స్వయంస్వావలంబన సాధించేలా, విశ్వవిద్యాలయ ఆవరణలోనే ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఇవి కూడా చదవండి:
కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..
మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..
Updated Date - Oct 30 , 2025 | 02:45 AM