Chilling Video Goes Viral: కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..
ABN , Publish Date - Oct 29 , 2025 | 09:19 PM
కూతురికి ఈత నేర్పించాలన్న ప్రయత్నం చైనాకు చెందిన తండ్రి ప్రాణాలను బలి తీసుకుంది. నీటిలో దూకిన ఆ తండ్రి వెన్నెముక దారుణంగా విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.
కూతురికి ఈత నేర్పించాలన్న సరదా ఓ తండ్రి ప్రాణం తీసింది. నీటిలోకి దూకిన అతడి వెన్నెముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 5 రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన చైనాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 18వ తేదీన నింగ్‌బోకు చెందిన 37 ఏళ్ల ఓ వ్యక్తి 7 ఏళ్ల తన కూతురికి ఈత నేర్పించడానికి స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లాడు.
కూతురికి ఈత నేర్పిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పైనుంచి నీటిలోకి ఎలా దూకాలో కూడా నేర్పించసాగాడు. రెండు సార్లు బాగానే దూకాడు. మూడోసారి అనుకోని విషాదం చోటుచేసుకుంది. అతడు నీటిలోకి దూకిన వేగానికి తల బలంగా పూల్ అడుగు భాగాన్ని తగిలింది. వెన్నెముక విరిగింది. పైకి లేవలేకపోయాడు. నొప్పితో విలవిల్లాడసాగాడు. తండ్రి బాధను గుర్తించిన కూతురు సాయం కోసం అరిచింది. అక్కడ ఉన్న వారు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అతడ్ని పరీక్షించిన వైద్యులు వెన్నెముక చాలా దారుణంగా విరిగిందని స్పష్టం చేశారు. అతడ్ని కాపాడ్డానికి చాలా ప్రయత్నించారు. చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత అతడు చనిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అయ్యోపాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు
ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు