Oversized Blazers Trend: భలే బ్లేజర్స్
ABN, Publish Date - Nov 12 , 2025 | 06:06 AM
వదులుగా ఉండే ఓవర్‌సైజ్ బ్లేజర్స్ తాజా ఫ్యాషన్ ట్రెండ్. అలియా భట్, ప్రియాంకా చోప్రా లాంటి బాలీవుడ్ అగ్రతారలు అనుసరిస్తున్న ఈ తాజా ట్రెండ్ మీద ఓ లుక్కేద్దాం...
ఫ్యాషన్
వదులుగా ఉండే ఓవర్‌సైజ్ బ్లేజర్స్ తాజా ఫ్యాషన్ ట్రెండ్. అలియా భట్, ప్రియాంకా చోప్రా లాంటి బాలీవుడ్ అగ్రతారలు అనుసరిస్తున్న ఈ తాజా ట్రెండ్ మీద ఓ లుక్కేద్దాం!
పవర్ డ్రస్సింగ్‌లో భాగంగా....
పవర్ డ్రస్సింగ్ కాలక్రమేణా ట్రెండ్‌గా మారిపోయింది. పొడవాటి స్కర్ట్, ట్రౌజర్స్, ఈవినింగ్ గౌన్‌లను ఓవర్‌సైజ్ బ్లేజర్స్‌తో కలిపి ధరించడం ఫ్యాషన్‌గా మారింది. అధికారికంగా, హూందాగా కనిపించే ఆధునిక దుస్తుల జాబితాలో ఇవి కూడా చేరిపోయాయి. సౌకర్యంగా ఉండడంతో పాటు, ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉండడంతో ప్రత్యేకించి ఉద్యోగినులు వీటి మీద మక్కువ చూపుతున్నారు.
యాక్సెసరీస్ ఇలా...
షార్ట్స్, ట్రౌజర్స్, లాంగ్ గౌన్స్‌తో కలిపి ధరించే ఈ బ్లేజర్స్ హూందాగా, ఆధునికంగా కనిపిస్తాయి. వీటికి తోడుగా హీల్స్, బూట్స్ ధరించవచ్చు. చేతిలో హ్యాండ్ బ్యాగ్, బ్రీఫ్ కేస్ నిండుదనాన్ని అందిస్తాయి. ఈ రకం దుస్తులతో సింపుల్ జ్యువెలరీ చక్కగా మ్యాచ్ అవుతుంది.
మేకప్ ఇలా...
సాధ్యమైనంత తక్కువ మేకప్ వేసుకున్నా, లిప్‌స్టిక్ బోల్డ్‌గా ఉండేలా చూసుకోవాలి. మేకప్ ముంజేతుల ఛాయతో సరిపోలేలా ఉండాలి. స్కర్ట్, షార్ట్స్ వేసుకున్నప్పుడు చర్మంలో కలిసిపోయే స్టాకింగ్స్ వేసుకోవాలి, లేదా మేకప్‌తో చర్మపు రంగును మ్యాచ్ చేయాలి.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం
Updated Date - Nov 12 , 2025 | 06:06 AM