Nita Ambani Dazzles: లెహరాయీ నవరంగ్ లెహంగా
ABN, Publish Date - Sep 28 , 2025 | 04:27 AM
నీతా అంబానీ అనగానే ప్రత్యేకమైన అవుట్‌ఫిట్స్, అందమైన జ్యువెలరీ కళ్లముందు కదలాడతాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆమె ధరించిన బెనారసీ లెహంగా చోళీ పలువురి...
నీతా అంబానీ అనగానే ప్రత్యేకమైన అవుట్‌ఫిట్స్, అందమైన జ్యువెలరీ కళ్లముందు కదలాడతాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆమె ధరించిన బెనారసీ లెహంగా చోళీ పలువురిని ఆకట్టుకుంటోంది. నవరాత్రి గుర్తుగా అమ్మవారి రూపాలకు ప్రతీకగా తొమ్మిది రంగులతో దీన్ని తీర్చిదిద్దారు. దీనికి జతగా గులాబీ రంగు ఎంబ్రాయిడరీ బ్లౌజ్(చోళీ), లెహరియా దుపట్టా ధరించి అందంగా మెరిసిపోయారు నీతా. సాదా మేకప్, చక్కని హెయిర్ స్టయిల్, రాజసం ఉట్టిపడే ఆభరణాలు ఆమెకు మరింత శోభనిచ్చాయి. అమ్మవారిని ఆరాధిస్తూ, గర్బా డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నీతా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. దసరాకి ఈ తరహా లెహంగా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేశారు అమ్మాయిలు.
నవరంగ్ లెహంగా...
ఫ ఇది మోనిక, కరిష్మా రూపొందించిన జేడ్ అవుట్‌ఫిట్. లెహంగా మొత్తాన్ని రంగురంగుల ప్యూర్ బెనారసి బ్రొకెడ్ క్లాత్‌తో రూపొందించారు. ఒక్కో రంగు మీద కూర్చి న ప్యాచ్ వర్క్‌లు, జరీ వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌లు అందంగా అమరాయి. లెహంగా అంతటా పరుచుకున్న భారీ లేస్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ లెహంగాకు గులాబీ రంగు బ్లౌజ్ (చోళీ) చక్కగా జతకూడింది. ఈ బ్లౌజ్ మెడ, చేతుల మీద బంగారు, కాంస్య జరీ డిజైన్లను ఒద్దికగా తీర్చిదిద్దారు. సంప్రదాయ టై అండ్ డై పద్ధతిలో రూపొందించిన గులాబీ, నారింజ రంగుల లెహరియా దుపట్టా.. డ్రెస్ అందాన్ని పెంచింది. ఈ దుపట్టా మీద ఉన్న మోటి్‌ఫలు అంచులకు ఉన్న జరీ డిజైన్ కలిసి రాజసాన్ని ఒలికించాయి. ఎంతో ప్రత్యేకంగా రూపొందిన ఈ నవరంగ్ లెహంగా చోళీ ధరించి గుజరాతి సంప్రదాయాన్ని కళ్లముందు నిలిపారు నీతా.
సొగసైన సింగారం...
నీతా పెట్టుకున్న అరుదైన ఆభరణాలు.. పండుగ శోభను ఆవిష్కరించాయి. లెహంగాకు మ్యాచ్ అయ్యేలా వజ్రాలు, పచ్చలు పొదిగిన మూడు వరుసల పెండెం ట్ల హారాన్ని ఆమె ధరించారు. హారానికి తగ్గట్టుగా చెవులకు పెద్ద జుంకాలు, పాపిడి మొదట్లో మాంగ్ టిక్కా, చిన్న ముక్కు పుడక, చేతులకు బంగారు కంకణాలతో పాటు గులాబీ రంగు గాజులు, వేళ్లకు పెద్ద ఉంగారాలు అలంకరించుకుని ఎలిగెంట్ రాయల్ లుక్‌తో నిండుగా కనిపించారామె.
మధ్య పాపిడి తీసిన బన్ హెయిర్ స్టయిల్, నుదుటిమీద ఎర్రని బొట్టు, మస్కారా, ఐ లైనర్, కోల్ ఐడ్, న్యూడ్ లిపిస్టిక్, రేడియంట్ హైలైటర్, లేత గులాబీ రంగు నెయిల్ పాలి్‌షతో ఆమె చేసుకున్న సొగసైన సింగారానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చొరబాట్లకు సిద్ధంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులు.. బీఎస్ఎఫ్ ఐజీ వెల్లడి
ఇక్కడున్నది ఎవరో మౌలానా మర్చిపోయినట్టున్నారు... యోగి స్ట్రాంగ్ వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Sep 28 , 2025 | 04:29 AM