Kids Earache Remedies: పిల్లల్లో చెవి నొప్పి తగ్గేదెలా
ABN, Publish Date - Nov 27 , 2025 | 02:17 AM
పిల్లల్లో చెవి నొప్పి తగ్గేదెలా..?
ఒక్కోసారి పిల్లలు చెవిలో నొప్పంటూ ఏడుస్తూ ఉంటారు. వైద్యుని దగ్గరకు వెళ్లేలోపు చిన్న చిట్కాలతో చెవి నొప్పి నుంచి పిల్లలకు ఉపశమనం కలిగించవచ్చు.
చెవి చుట్టూరా హీట్ ప్యాడ్‌తో అద్దడం వల్ల పిల్లలకు చెవి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. హీట్ ప్యాడ్ అందుబాటులో లేని పక్షంలో చేతి రుమాలును వేడి చేసి ఉపయోగించవచ్చు.
ముక్కులో లేదా గొంతులో శ్లేష్మం చేరి చిక్కబడడం వల్ల కూడా చెవి నొప్పి రావచ్చు. పిల్లలకు గోరువెచ్చని నీరు తాగిస్తూ ఉంటే ఫలితం కనిపిస్తుంది.
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది నొప్పిని హరించడంలో బాగా పనిచేస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి పిల్లలచేత కొద్దికొద్దిగా తినిపిస్తే చెవి నొప్పి తగ్గుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, పావు చెంచా మిరియాల పొడి కలిపి పిల్లల చేత తాగిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఒక చెంచా అల్లం రసంలో అరచెంచా తేనె కలిపి పిల్లల చేత నాకిస్తే చెవినొప్పి తగ్గుతుంది. వేడి వేడిగా సూప్‌లు తాగించినా ఫలితం ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే చేపలు, అవిసెలు, ఇతర గింజలను పిల్లలు తినే ఆహారంలో చేర్చడం వల్ల వారికి చెవి నొప్పి రాదు
స్ట్రాబెర్రీ, కివి, నారింజ, జామ, బత్తాయి, అనాస పండ్లతోపాటు ఆకుకూరలను పిల్లలకు తినిపిస్తుంటే చెవి నొప్పి సమస్య దరి చేరదు.
రాత్రిపూట పిల్లలు చెవినొప్పితో బాధపడుతుంటే.. ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా వేడిచేసి దానితో చెవి చుట్టూరా మర్దన చేయాలి. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కొద్దిపాటి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. సింహాలు కూడా ఇంతలా భయపడతాయా.. నది ఒడ్డున ఏం జరిగిందో చూడండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 888ల మధ్య 808 ఎక్కడుందో 8 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 27 , 2025 | 02:17 AM