ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nail Rings: నెయిల్‌ రింగ్స్‌ తో నైస్‌గా

ABN, Publish Date - Oct 12 , 2025 | 06:40 AM

మహిళలు గోళ్లమీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. గోళ్లను పొడవుగా పెంచి వాటిని చక్కగా షేప్‌ చేసి నెయిల్‌ పాలిష్‌ వేసుకుని మురిసిపోతుంటారు. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ను అమితంగా ఇష్టపడే అమ్మాయిలు మాత్రం నెయిల్‌ ఆర్ట్స్‌తో...

మహిళలు గోళ్లమీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. గోళ్లను పొడవుగా పెంచి వాటిని చక్కగా షేప్‌ చేసి నెయిల్‌ పాలిష్‌ వేసుకుని మురిసిపోతుంటారు. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ను అమితంగా ఇష్టపడే అమ్మాయిలు మాత్రం నెయిల్‌ ఆర్ట్స్‌తో సందడి చేస్తుంటారు. గోళ్లమీద రంగు రంగుల డిజైన్లు సృష్టిస్తూ వాటిమీద చిన్న చిన్న రాళ్లు, పూసలు అతికిస్తూ సరికొత్త పోకడలను అనుసరిస్తున్నారు యువతులు. ఈ క్రమంలోనే ‘నెయిల్‌ రింగ్స్‌’ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. నెయిల్‌ ఆర్ట్‌ కంటే సౌలభ్యంగా ఉండడంతో మహిళలు నేరుగా వీటిపై దృష్టి సారించడం మొదలుపెట్టారు. అన్ని వయసులవారిని అమితంగా ఆకర్షిస్తున్న ఈ ‘నెయిల్‌ రింగ్స్‌’ పై ఓ లుక్కేద్దామా...

నెయిల్‌ రింగ్స్‌ అంటే..?

చేతి వేళ్లకు పెట్టుకున్నట్లే గోళ్లకూ పెట్టుకునే ఉంగరాలే ‘నెయిల్‌ రింగ్స్‌’. గోరు మొత్తాన్ని కవర్‌ చేసేవి, గోరు మొదట్లో లేదా చివర్లో పెట్టుకునేవి, గోరు మధ్యలో అమర్చుకునేవి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. బంగారం, వెండి, బ్లాక్‌ మెటల్‌తో తయారుచేసిన నెయిల్‌ రింగ్స్‌ను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పువ్వులు, ఆకులు, లతలు, నెమళ్లు, సీతాకోక చిలుకలు, హార్ట్‌, జ్యామెట్రీ ఆకారాలతోపాటు ఎన్నో విభిన్నమైన డిజైన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిమీద చిన్న చిన్న నక్షత్రాలు, రంగురంగుల్లో మెరిసే రాళ్లు, స్వరోస్కి క్రిస్టల్స్‌ పొదిగి అందంగా రూపొందిస్తున్నారు. నెయిల్‌ రింగ్స్‌ను చేతి వేళ్లన్నింటికీ పెట్టుకోవచ్చు. లేదంటే ఒకటి లేదా రెండు వేళ్లకు అమర్చుకున్నా మంచి లుక్‌ వస్తుంది. అందుకే స్టయిలిష్‌ యాక్ససరీ్‌సలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి ‘నెయిల్‌ రింగ్స్‌’.

సెలబ్రిటీలు సైతం...

ప్రముఖ హీరోయిన్లతో సహా మోడల్స్‌, ఫ్యాషన్‌ మీద ఆసక్తి ఉన్న యువతులు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సొనాలి బింద్రే, కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, హీనా ఖాన్‌, కరిష్మా తన్నాలు పలు ఈవెంట్లలో నెయిల్‌ రింగ్స్‌ ధరించి అందంగా మెరిశారు. చెవి దిద్దులు, జుంకాలు; వేళ్ల ఉంగరాలు; మెడలో నెక్లెస్‌ లేదా చోకర్‌కు మ్యాచ్‌ అయ్యేలా నెయిల్‌ రింగ్స్‌ ధరించి ఫొటోలకు ఫోజు లిచ్చారు. దీంతో యువతులంతా రకరకాల నెయిల్‌ రింగ్స్‌ కోసం నెట్టింట వెదకడం ప్రారంభించారు. అమామా, భవ్య రమేష్‌, మదిహా జైపూర్‌, యురుమ్మే, రిచా బైసా, ఆయేషా, ఓంత్‌, రాతెల్‌ అండ్‌ ఓల్ఫ్‌, యెప్రెమ్‌, హగో క్రైట్‌ లాంటి బ్రాండ్‌ల నుంచి నెయిల్‌ రింగ్స్‌ కొనుక్కోవచ్చు.

ఎంపిక ఎలా..?

విభిన్నమైన ఆధునిక స్టయిల్స్‌కి కొత్త బాష్యం చెబుతున్నాయి నెయిల్‌ రింగ్స్‌. డిజైనర్‌ వేర్‌, భారీ లెహంగాలతోపాటు అన్ని రకాల మోడరన్‌ డ్రెస్‌లమీద ఇవి చక్కగా సూటవుతాయి. కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లేటప్పుడు రోజువారీ ధరించడానికి సింపుల్‌ డిజైన్లలో; వివాహాది శుభకార్యాలు, పార్టీల్లో ధరించడానికి భారీ డిజైన్లలో నెయిల్‌ రింగ్స్‌ లభ్యమవుతున్నాయి. నెయిల్‌ రింగ్స్‌ ధరించేటప్పుడు గోళ్లకు వేసుకోవాల్సిన నెయిల్‌ పాలిష్‌ రంగులను జాగ్రత్తగా ఎంచుకోవాలంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. మెరిసే డిజైన్లతో గోల్డ్‌ షేడెడ్‌ నెయిల్‌ రింగ్స్‌ ధరించేటప్పుడు ముదురు రంగు నెయిల్‌ పాలిష్‌ వేసుకోవాలి. అదే సిల్వర్‌ షేడెడ్‌ నెయిల్‌ రింగ్స్‌ పెట్టుకునేటట్లయితే లేత రంగుల్లో మెరిసే నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటే బాగుంటుంది.

ఇలా మొదలైంది...

నెయిల్‌ రింగ్‌ అనేది ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్‌ కాదంటున్నారు ప్రముఖ జ్యువెలరీ డిజైనర్‌ ఈనా అహ్లువాలియా. పదిహేనేళ్ల క్రితం బ్రిటిష్‌ జ్యువెలరీ డిజైనర్‌ జాస్మిన్‌ అలెగ్జాండర్‌ వేలికి ఇలాంటి ఆభరణాన్ని చూశానన్నారు ఆమె. అసలు విషయం ఏమిటంటే... ఆభరణాలను రూపొందించే క్రమంలో ప్రమాదవశాత్తు తన వేలి గోరు భాగాన్ని కోల్పోయారు జాస్మిన్‌. ఆ లోటును భర్తీచేసేందుకు ఆమె ప్రొస్థటిక్‌ మెటల్‌తో కృత్రిమ గోరును తయారుచేసుకుని ధరించారు. అప్పట్లో అది ఆమె ప్రత్యేక స్టయిల్‌గా పలువురిని ఆకట్టుకుంది. క్రమంగా దాన్నే కొంతమంది యాక్ససరీలా అనుసరించడం ప్రారంభించారు అంటూ చెప్పుకొచ్చారు ఈనా.

ఈ వార్తలు కూడా చదవండి..

అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 06:40 AM