Share News

Palla Srinivas On Botsa: అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 11 , 2025 | 04:40 PM

పెట్టుబడిదారుల్లో వైసీపీ నాయకులు భయాందోళనలు పుట్టిస్తున్నారని పల్లా శ్రీనివాస్ అన్నారు. మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్‌పరం కావని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే 7,300 కోట్ల రూపాయలు కావాలన్నారు.

Palla Srinivas On Botsa: అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్
Palla Srinivas On Botsa

అమరావతి, అక్టోబర్ 11: కూటమి ప్రభుత్వం మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (AP TDP Chief Palla Srinivas) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నం దేశంలో అతిపెద్ద డేటా వ్యాలీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ వరల్డ్ డేటా సెంటర్‌గా మారబోతుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు వైసీపీ నాయకుల వల్ల భయపడిపోతున్నారని మండిపడ్డారు. 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు. మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్‌పరం కావని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పూర్తి కావాలంటే రూ.7,300 కోట్లు కావాలన్నారు.


కాలేజీలను పూర్తి చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీపై ఫైర్ అయ్యారు పల్లా. పీపీపీ విధానం వల్ల ఎవరికీ నష్టం జరగదన్నారు. లిక్కర్ వ్యవహారంలో తాము ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. గత పాలకులు చేసిన పాపాలే ఇప్పుడు శాపాలయ్యాయని విమర్శించారు. అక్రమ లిక్కర్ వ్యవహారంలో ఎంతటి వారున్నా కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అంటే తమకు ఎనలేని గౌరవం ఉందని.. బొత్సకు జగన్ వల్లే ప్రాణహాని ఉందన్నారు. కూటమి నాయకుల నుంచి కానీ.. ప్రభుత్వం వల్ల కానీ బొత్సకి ఎటువంటి హాని లేదని తెలిపారు. ఇటీవల కాలంలో శాసనమండలిలో బొత్స సత్యనారాయణ బాగా ఫోకస్ అవుతున్నారని చెప్పారు. బాబాయ్‌ను ఎవరు చంపారో అందరికీ తెలుసని అన్నారు. తనని దాటి వెళ్లిపోతున్నారంటే జగన్ తట్టుకోలేరంటూ పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

దుర్గగుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటా..

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 11 , 2025 | 07:13 PM