Mosquito Protection For Kids: దోమకాటు నుంచి పిల్లలకు రక్షణ ఇలా
ABN, Publish Date - Aug 13 , 2025 | 12:40 AM
వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల పిల్లలకు చర్మ సంబంధిత అలెర్జీలు, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాకాకుండా చిన్నారులను దోమలబారి నుంచి ఎలా కాపాడాలో తెలుసుకుందాం...
వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల పిల్లలకు చర్మ సంబంధిత అలెర్జీలు, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాకాకుండా చిన్నారులను దోమలబారి నుంచి ఎలా కాపాడాలో తెలుసుకుందాం...
చిన్న పిల్లలకు పొడవు చేతులు ఉన్న షర్టులు, ప్యాంట్లు వేయాలి. ముదురు రంగులు దోమలను ఆకర్షిస్తాయి. కాబట్టి పిల్లలకు లేత రంగుల బట్టలు వేయాలి. చేతులకు, పాదాలకు నిర్దేశిత సాక్స్‌లు వేయడం మంచిది.
మస్కిటో రిపెల్లెంట్ బ్యాడ్జెస్, పెండెంట్స్, ప్యాచె్‌సలను పిల్లలు వేసుకున్న డ్రెస్‌లకు జతచేయాలి. వీటిలో ఉండే యూకలిప్టస్, నిమ్మ, వేప, సిట్రోనెల్లా నూనెలు గాఢమైన వాసనలను వెదజల్లుతాయి. దీంతో దోమలు.. పిల్లల నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఈ నూనెలు సహజసిద్ధమైనవి. వీటి వల్ల పిల్లలకు ఎటువంటి అపాయమూ ఉండదు.
దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులకు మ్యాగ్నెటిక్ మస్కిటో స్ర్కీన్‌లు లేదంటే మెష్‌లను ఏర్పాటు చేయాలి.
పిల్లలు నిద్రిస్తున్నప్పుడు వాళ్లపై నెట్ గొడుగులు ఉంచాలి. మంచానికి దోమతెరను కట్టినా ప్రయోజనం ఉంటుంది.
గదుల్లో, బాల్కనీల్లో సిట్రోనెల్లా, లావెండర్, బంతి పూల మొక్కల కుండీలు ఏర్పాటు చేస్తే దోమలు వెంటనే బయటికి వెళ్లిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 13 , 2025 | 12:40 AM