ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Zen Guru Disciple Bond: గురువు చూపిన దారి

ABN, Publish Date - Aug 08 , 2025 | 02:05 AM

ప్రతి గురువు తనకు తెలిసిన సాధనా పద్ధతులను శిష్యులకు బోధిస్తాడు. శిష్యులలో కొందరు వాటిని తీవ్రంగా సాధన చేస్తారు. కఠోరమైన తపస్సు చేసిన వారి చుట్టూ పుట్టలు పెరగడం, చుట్టూ జంతువులు, పక్షులు సంచరించడం లాంటి కథలు...

జెన్‌ కథ

ప్రతి గురువు తనకు తెలిసిన సాధనా పద్ధతులను శిష్యులకు బోధిస్తాడు. శిష్యులలో కొందరు వాటిని తీవ్రంగా సాధన చేస్తారు. కఠోరమైన తపస్సు చేసిన వారి చుట్టూ పుట్టలు పెరగడం, చుట్టూ జంతువులు, పక్షులు సంచరించడం లాంటి కథలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక శిష్యుడి కథ ఇది.

ఒక జెన్‌ గురువు ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఉండేవారు. వారందరూ గురువు సూచన మేరకు సాధన చేసేవారు. వారిలో ఒకరికి జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉండేది. ఎంతో ఎక్కువ దీక్షతో తపస్సు, ధ్యానం చేసేవాడు. అతను రోజుల తరబడి కదలకుండా, మెదలకుండా ధ్యానంలో ఉండిపోవడంతో... గడ్డాలు, మీసాలు పెరిగిపోయాయి. జుట్టు బాగా పెరిగి జడలు కట్టింది. అతని దేహం మీద పురుగులు పారాడడం, పాములు ప్రాకడం మొదలుపెట్టాయి. రకరకాల జంతువులు అతనికి దగ్గరగా వచ్చి కూర్చొనేవి. అతని తలపై పక్షులు గూడు కట్టుకొని నిర్భయంగా నివసించసాగాయి. అతను మామూలు స్థితిలోకి వచ్చినప్పుడు... ఇదంతా మౌనంగా గమనించేవాడు తప్ప ఏ పక్షినీ, ఏ పురుగునూ ఏమీ అనేవాడు కాదు.

ఆ వైపు వచ్చీ పోయే జనం అతణ్ణి గొప్ప యోగిగా, తపస్విగా భావించి ఎంతో గౌరవించేవారు. బాగా పొగిడేవారు. క్రమంగా తాను చాలా గొప్పవాడిననే భావం అతనిలో పెరిగింది. దాంతో అతని ధ్యానంలో తీవ్రత క్రమంగా తగ్గిపోసాగింది. ఈ సంగతి గురువుకు తెలిసింది. రాబోయే ప్రమాదం ఏమిటో గ్రహించిన గురువు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదనుకున్నాడు. సరాసరి ఆ శిష్యుడు కూర్చున్న చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో శిష్యుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. అతని చుట్టూ జంతువులు తిరుగుతున్నాయి. తలపైన ఉన్న గూడులోని పక్షులు తలలు బయటకు పెట్టి తొంగి చూస్తున్నాయి. అప్పుడు ఆ గురువు... తన శిష్యుణ్ణి రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, బాగా కదిపాడు. గాఢ నిద్రలోంచి మేలుకొన్నవాడిలా శిష్యుడు గభాలున కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కనిపించిన గురువుకు గౌరవంగా నమస్కరించబోయాడు. గురువు కోపంతో ‘‘ఏమిటి ఇదంతా? తలపై ఈ గూడు ఏమిటి?’’ అంటూ దాన్ని గట్టిగా లాగేశాడు. పక్షులు తుర్రున ఎగిరిపోయాయి. గురువు అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

కొద్దికాలంగా జరుగుతున్న సంఘటనలన్నీ శిష్యుడి కళ్ళముందు మెదిలాయి. తాను కదలకుండా కూర్చొని ధ్యానం చేయడం, పశుపక్ష్యాదులు తన చెంత చేరడం, తను వాటిని మౌనంగా పెంచి పోషించడం, అందరూ తనను పొగడడం, పూజించడం, తనలో గొప్పవాణ్ణనే అహంకారం వృద్ధి చెందడం, అది తన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకంగా నిలవడం... అన్నీ గుర్తుకువచ్చాయి. గురువు సరైన సమయంలో వచ్చి, మందలించడం వల్ల తనకు తప్పిన ప్రమాదం ఏమిటో, కలిగిన శ్రేయస్సు ఏమిటో. తనకు ఆయన చూపిన దారి ఏమిటో స్పష్టంగా బోధపడింది. కరుణామూర్తి అయిన గురువు నడిచి వెళ్ళిన దిశలో నేలను చూశాడు. కంటి నుంచి నీరు కారుతూ ఉండగా... గురువు పాదముద్రలను తన చేతులతో తాకి, ఆ చేతులను తన హృదయంపై ఆనించి... గురువుకు మనసులోనే కృతజ్ఞత తెలియజేశాడు.

రాచమడుగు శ్రీనివాసులు

ఈ వార్తలు కూడా చదవండి..

కుట్టిన సాలీడు.. బాలిక మృతి

తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు

For More Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2025 | 02:05 AM