ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Manika Vishwakarma: అందం ప్రతిభ కలబోత మణిక

ABN, Publish Date - Aug 21 , 2025 | 05:30 AM

అందం... దీనితో పాటుగా అనేక కళలలో ప్రతిభ... ఈ రెండు ఉన్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఈసారి మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మణికా విశ్వకర్మ ఈ అరుదైన వ్యక్తుల్లో ఒకరు...

అందం... దీనితో పాటుగా అనేక కళలలో ప్రతిభ... ఈ రెండు ఉన్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. ఈసారి మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మణికా విశ్వకర్మ ఈ అరుదైన వ్యక్తుల్లో ఒకరు. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ మణిక?...

రాజస్థాన్‌కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చదువుతోంది. కేవలం చదువులోనే కాకుండా అనేక కళలలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. తను చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. భారతీయ విదేశాంగ శాఖ విదేశాలలో నిర్వహించిన అనేక కార్యక్రమాలలో ఆమె నృత్య కళాకారిణిగా పాల్గొంది. మణిక మంచి పెయింటర్‌ కూడా! ఆమెకు లలిత కళా అకాడమీ నుంచి అవార్డులు కూడా లభించాయి. నరాలకు సంబంధించిన వ్యాధులతో పుట్టిన చిన్నారులకు సాయం అందించటానికి మణిక ‘న్యూరోనోవా’ అనే ఒక సంస్థను స్థాపించింది.

గెలవటానికి కారణమయిన ప్రశ్న ఇదే!

‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా- ఫైనల్స్‌’లో - ‘‘మహిళలకు విద్యను అందిస్తారా లేక పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారా?’’ అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం వల్ల ఆమె ఈ పోటీని గెలవగలిగింది. ‘‘నేను మహిళకు విద్యను అందించటానికే ఇష్టపడతాను. ఎందుకంటే మహిళలకు విద్యను అందిస్తే- వారి ఒక్కరి జీవితం మాత్రమే కాదు... వారి కుటుంబాల భవిష్యత్తు, సమాజం భవిష్యత్తు,దేశం భవిష్యత్తు మారుతుంది’’ అని ఆమె ఇచ్చిన జవాబును జడ్జీలు మెచ్చుకున్నారు.

సూటిగా, స్పష్టంగా...

మణిక తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెబుతుంది. పోటీలో గెలిచిన తర్వాత- ‘‘చాలామంది గెలిచిన తర్వాత తాము ఎంత కష్టపడ్డారనే విషయాన్ని చెబుతారు. కానీ నేను నాకు లభించిన మద్దతు గురించి మాట్లాడాలనుకుంటున్నా. నా కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి ఎంతో మద్దతు ఇచ్చింది. నేను ఒక చిన్న పట్టణం నుంచి వచ్చాను. అయినా నేను ఈ రోజున ఈ పోటీలో గెలిచానంటే- నా కుటుంబంతో పాటుగా నా టీచర్ల పాత్ర కూడా ఎంతో ఉంది. అందుకే నేను పడిన కష్టాల గురించి కాకుండా- వారు నాకు ఇచ్చిన మద్దతు గురించి చెప్పాలనుకుంటున్నా’’ అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది.

మిస్‌ యూనివర్స్‌ పోటీ గురించి...

‘‘అందాల పోటీలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపచేస్తాయి. దీనిలో గెలిస్తే- కొన్ని లక్షల మందికి స్ఫూర్తిని ఇవ్వొచ్చు. నేను అలాంటి స్థితిలో ఉన్నాననే భావన ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ‘మిస్‌ రాజస్థాన్‌’ నుంచి .మిస్‌ యూనివర్స్‌ ఇండియా - ఫైనలి్‌స్ట’గా మారటం వెనుక ఒక ప్రస్థానం ఉంది. ఈ ప్రస్థానంలో ఎటువంటి అనిశ్చితి లేదు. నా మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అది పునాదిగా పనిచేసింది. ఈ పునాదిపై ఏకాగత్ర, లక్ష్యం అనే భావనల ఆధారంగా ఒక సౌధాన్ని నిర్మించగలిగాను’’ అని ఆమె పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 05:33 AM