ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Makhana Healthy Snack: మఖ్‌నా మతలబు

ABN, Publish Date - Aug 26 , 2025 | 12:48 AM

మఖ్‌నా కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారమే! పొట్ట కదలికలను క్రమబద్ధీకరించి, జీర్ణశక్తిని పెంచే మఖ్‌నా, పేగుల ఆరోగ్యంతో పాటు శక్తి ఖర్చయ్యే వేగాన్ని కూడా పెంచుతాయి. అయితే ఈ ఆరోగ్యకరమైన పదార్థాన్ని...

ఆహారం- ఆరోగ్యం

మఖ్‌నా కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారమే! పొట్ట కదలికలను క్రమబద్ధీకరించి, జీర్ణశక్తిని పెంచే మఖ్‌నా, పేగుల ఆరోగ్యంతో పాటు శక్తి ఖర్చయ్యే వేగాన్ని కూడా పెంచుతాయి. అయితే ఈ ఆరోగ్యకరమైన పదార్థాన్ని తినకూడని వాళ్లూ ఉన్నారు. వాళ్లెవరంటే....

మూత్రపిండాల్లో రాళ్లు: వీటిలోకి ఆక్సలేట్స్‌, క్యాల్షియం, మెగ్నీషియం శోషణను కుంటుపరచడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి తోడ్పడతాయి. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్ల ముప్పు ఉన్నవాళ్లు మఖ్‌నాలను తినకపోవడమే మేలు.

జీర్ణ సమస్యలు: ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ లేదా ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌ సమస్యలున్నవారు, మఖ్‌నా లాంతి అత్యధిక పీచు పదార్థాలను జీర్ణం చేసుకోలేరు. దాంతో కడుపుబ్బరం, పొత్తికడుపులో అసౌకర్యం తలెత్తుతాయి

యూరిక్‌ యాసిడ్‌: మఖ్‌నాల్లో ప్యూరిన్స్‌ అనే సమ్మేళనాలుంటాయి. ఇవి శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ను పెంచుతాయి. కాబట్టి గౌట్‌ సమస్య ఉన్నవారు, అత్యధిక యూరిక్‌ యాసిడ్‌ మోతాదులున్నవారు మఖ్‌నాకు దూరంగా ఉండాలి

రక్తం పలుచనయ్యే మందులు: మఖ్‌నాలో విటమిన్‌ కె ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే కె విటమిన్‌ అధికంగా ఉండడం వల్ల వీటిని తిన్నప్పుడు, వార్ఫారిన్‌ లాంటి రక్తం పలుచనయ్యే మందుల ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి మందులు వాడుకుంటున్నవారు మఖ్‌నా తినడం మానుకోవాలి.

Also Read:

గుండె జబ్బులకు దారితీసే మూడు కారణాలు ఇవే..

కోహ్లీ బ్యాట్ వల్ల నాకు బ్యాడ్ నేమ్..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 12:48 AM