ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పిల్లలిచ్చిన సలహాతో...

ABN, Publish Date - Apr 06 , 2025 | 01:34 PM

4 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు ఇచ్చే సలహాలను స్వీకరించి, వాటికి కార్యరూపం ఇస్తుంటారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి, వాటిని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు.

ఇంగ్లాండ్‌కు చెందిన రూత్‌ అమోస్‌, షావ్న్‌ బ్రౌన్‌కు ‘కిడ్స్‌ ఇన్వెంట్‌ స్టఫ్‌’ అనే ఒక యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. 4 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు ఇచ్చే సలహాలను స్వీకరించి, వాటికి కార్యరూపం ఇస్తుంటారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి, వాటిని యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. అలా ఇప్పటివరకు దాదాపు 70 ఇన్నోవేషన్లు చేశారట.

అందులో భాగంగానే... ఈ అతిపెద్ద బ్రష్‌ని కూడా పదకొండేళ్ల జార్జ్‌ బాండ్‌ సలహాతో తయారు చేశారు. చిన్నారి జార్జ్‌ నాన్న తోటపని చేసేవారట. రోజూ ఉదయం, సాయంత్రం తోటలో ఆయన పడుతున్న ఇబ్బందిని, కష్టాన్ని పళ్లు తోముకుంటూ చూసేవాడు. ‘నేను పళ్లు శుభ్రం చేసుకుంటున్నంత సులువుగా మా నాన్న కూడా తోట పని చేస్తే ఎంత బాగుంటుంది.

ఈ వార్తను కూడా చదవండి: ఆయన ‘టీమిండియా’కు ఫీల్డింగ్‌ నేర్పుతాడు..


అలాంటి ఒక పరికరం ఒకటి తయారుచేస్తే చూడాలని ఉంద’ని రూత్‌, షావ్న్‌కి చెప్పాడట. దాంతో ఆ కుర్రాడి ఆలోచనకు తగ్గట్టుగా వినూత్నంగా ఒక పరికరాన్ని ఐదు రోజులు కష్టపడి తయారు చేశారు. అది కూడా టూత్‌బ్రష్‌ రూపంలో. టూత్‌బ్రష్‌ పళ్లను సులువుగా శుభ్రం చేసినట్టే... ఈ ఎలక్ట్రిక్‌ బ్రష్‌ రూపంలో ఉన్న మిషన్‌ తోట పనిని సులువుగా చేస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ బ్రష్‌గా ఏకంగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో కూడా స్థానం దక్కించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

పోస్టల్‌ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

మెట్రో రైల్‌పై బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం ఆపండి

Read Latest Telangana News and National News

Updated Date - Apr 06 , 2025 | 01:34 PM