Ethnic Wear: లాన్ సల్వార్ సూట్‌తో ట్రెండీగా
ABN, Publish Date - Jul 16 , 2025 | 02:07 AM
అందంగా కనిపించడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే దుస్తులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు నేటి యువతులు. ఈ కోవలోనే లాన్ సల్వార్ సూట్లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. చక్కని డిజైన్‌తో...
ఫ్యాషన్
అందంగా కనిపించడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే దుస్తులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు నేటి యువతులు. ఈ కోవలోనే లాన్ సల్వార్ సూట్లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. చక్కని డిజైన్‌తో రూపొందించిన కుర్తా, దానికి మ్యాచ్ అయ్యేలా ఆకర్షణీయమైన రంగులో సల్వార్, పొడవాటి చున్నీ ఈ సూట్ ప్రత్యేకత. కాలేజీలకు, కార్యాలయాలకు వెళ్లేటప్పుడు రోజువారీ ధరించడానికి అనుకూలంగా ఉండడంతో ఈ సూట్ అమ్మాయిలను బాగా ఆకర్షిస్తోంది.
పత్తికి పాలిస్టర్, రేయాన్, లెనిన్ మిశ్రమాల్లో ఒకదాన్ని కొద్దిగా జతచేసి లాన్ వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ వస్త్రం చాలా మెత్తగా కొద్దిపాటి మెరుపుతో ఉంటుంది. ఒకప్పుడు తువాళ్లు, చేతి రుమాళ్లు, చిన్న గౌన్లు, దుపట్టాల కోసం ఈ వస్త్రాన్ని వినియోగించేవారు. ప్రస్తుతం విభిన్న డిజైన్లలో సల్వార్ సూట్లు రూపొందిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రింట్లతోపాటు ఎంబ్రాయిడరీ, కుందన్, జర్దోసీ, ప్యాచ్ వర్క్‌లు జతచేసి అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి చిన్నపాటి ఫంక్షన్లలో, పార్టీల్లో ధరించడానికి బాగుంటాయి. వాతావరణం వేడిగా లేదా చల్లగా ఉన్నప్పటికీ శరీరానికి హాయిగా ఉండే అనుభూతిని అందిస్తాయి ఈ లాన్ సూట్లు.
ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు ఈ సూట్‌లో కనిపిస్తుండడంతో అమ్మాయిల దృష్టి వీటిమీదికి మళ్లింది. ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా ఇవి చక్కగా నప్పుతాయి. కుర్తా పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్నా బాగుంటుంది. నెక్ డిజైన్లు కూడా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. సల్వార్‌గా షరారా, చుడీదార్ ఇలా ఏ రకమైనా ధరించవచ్చు. చున్నీని ఒక భుజం మీద పొడవుగా వేసుకుంటే బాగుంటుంది. ఈ సూట్ మీదికి పెద్దగా నగలు వేసుకోనక్కర్లేదు. మెడలో చిన్న గొలుసు లేదా చోకర్, ఒక చేతికి వాచ్ పెట్టుకుంటే చాలు. మరో చేతికి లావుపాటి బ్యాంగిల్ వేసుకోవచ్చు. అందమైన చిన్న బ్యాగ్ లేదా క్లచ్ పట్టుకుంటే హుందాగా కనిపిస్తారు.
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 16 , 2025 | 02:08 AM