Share News

Trump India Pakistan Claim: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 08:39 AM

Trump India Pakistan Claim: పాకిస్తాన్, ఇండియా కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధాన్ని ఆపేశాయి. అప్పటికే పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది. యుద్ధం అలాగే కొనసాగి ఉంటే పాకిస్తాన్ సర్వనాశనం అయ్యేది. యుద్ధం ఆగటం పాకిస్తాన్ మేలుకే అయింది.

Trump India Pakistan Claim: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Trump India Pakistan Claim

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిట్టల దొరను మించిపోయారు. ప్రపంచంలో ఏ అద్భుతం జరిగినా.. ఏ యుద్ధం ఆగినా అందుకు తానే కారణం అంటున్నారు. భారత్, పాకిస్తాన్ ‌దేశాల మధ్య యుద్ధం గురించి మరోసారి మాట్లాడారు. తానే గనుక లేకపోతే రెండు దేశాలు నాశనం అయ్యేవి అన్న లెవల్లో బిల్డప్ ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా భారత్, పాకిస్తాన్ యుద్ధం ప్రస్తావన తెచ్చారు.


ఆయన మాట్లాడుతూ.. ‘యుద్ధాలు ఆపటంలో మేము విజయం సాధిస్తున్నాము. ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని అలాగే ఆపాము. రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగి ఉంటే.. అది మరో వారానికి న్యూక్లియర్ యుద్ధంగా మారేది. అప్పుడు పరిస్థితి దారుణంగా ఉండింది. పాకిస్తాన్, ఇండియాపై న్యూక్లియర్ బాంబు వేసేది. వ్యాపారం పేరు చెప్పి రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేశాము. యుద్ధం ఆపేంత వరకు వాణిజ్య పరమైన ఒప్పందాలు చేసుకునేది లేదని చెప్పాము. ఎవ్వరూ చెయ్యని పని నేను చేశాను.


దాని గురించి నేను పెద్దగా మాట్లాడదల్చుకోలేదు. కానీ, మేము ఓ పెద్ద సమస్యను తీర్చాము. పాకిస్తాన్, ఇండియాల మధ్య న్యూక్లియర్ వార్‌ను ఆపాము. నేను ఇండియా, పాకిస్తాన్‌ ప్రధానులతో మాట్లాడాను. వారు గొప్ప లీడర్లు. అయినా కూడా న్యూక్లియర్ యుద్ధం వైపు మొగ్గు చూపారు. నేనే గనుక అడ్డు పడకపోయి ఉంటే న్యూక్లియర్ వార్ జరిగి ఉండేది’ అని అన్నారు. కాగా, పాకిస్తాన్, ఇండియా కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధాన్ని ఆపేశాయి. అప్పటికే పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది. యుద్ధం అలాగే కొనసాగి ఉంటే పాకిస్తాన్ సర్వనాశనం అయ్యేది.


ఇవి కూడా చదవండి

గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ.. వంటగదిలోని ఈ 4 సుగంధ ద్రవ్యాలతో అన్నీ మాయం..!

ఆర్గానిక్ టీ vs టీ బ్యాగ్.. ఏ టీ మంచిదో తెలుసా?

Updated Date - Jul 15 , 2025 | 10:48 AM