ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Korameenu Fish Fry Recipe: కొరమీను చేపల వేపుడు

ABN, Publish Date - Sep 20 , 2025 | 03:23 AM

వారానికి రెండుసార్లు చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పెద్దవారిలో అల్జీమర్స్‌ లక్షణాలు తగ్గుతాయి. మహిళలకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది....

వారానికి రెండుసార్లు చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పిల్లలకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పెద్దవారిలో అల్జీమర్స్‌ లక్షణాలు తగ్గుతాయి. మహిళలకు నెలసరి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కావాల్సిన పదార్థాలు

కొరమీను చేప ముక్కలు- ఒక కేజీ, నూనె- అయిదు గరిటెలు, కారం- రెండుంపావు చెంచాలు, పసుపు- పావు చెంచా, ఉప్పు- ఒకటింపావు చెంచాలు, ధనియాలు- నాలుగు చెంచాలు, సోంపు- అర చెంచా, జీలకర్ర- రెండు చెంచాలు, లవంగాలు- పది, యాలకులు- మూడు, దాల్చిన చెక్క- రెండు చిన్న ముక్కలు, గసగసాలు- మూడు చెంచాలు, పచ్చిమిర్చి- అయిదు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర చెంచాలు, నిమ్మకాయలు- రెండు

తయారీ విధానం

  • మిక్సీలో ధనియాలు, సోంపు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పొడిని చిన్న గిన్నెలోకి తీసుకోవాలి.

  • వెడల్పాటి గిన్నెలో చేప ముక్కలు, ఒక గరిటె నూనె, రెండు చెంచాల కారం, పసుపు, ఒక చెంచా ఉప్పు వేసి కలపాలి. చేప ముక్కలకు ఉప్పు-కారం మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. ఈ గిన్నె మీద మూతపెట్టి అరగంటసేపు నాననివ్వాలి.

  • స్టవ్‌ మీద వెడల్పాటి మూకుడు పెట్టి, నాలుగు గరిటెల నూనె పోసి వేడి చేయాలి. తరువాత చేప ముక్కలు వేసి వాటిని రెండు వైపులకూ తిప్పుతూ ఉండాలి. లోపలిదాకా ఉడికేలా చిన్న మంట మీద ఎర్రగా వేపాలి. మెత్తగా వేగిన చేప ముక్కలను ఒక పళ్లెంలోకి తీయాలి. అదే గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా వేపాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు పచ్చి మిర్చి చీలికలు, ముందుగా గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాలా పొడి, పావు చెంచా కారం, పావు చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి జాగ్రత్తగా కలపాలి. చేప ముక్కలకు మసాలా పూర్తిగా పట్టేలా కలిపి రెండు నిమిషాలు వేగనిచ్చి స్టవ్‌ మీద నుంచి దించాలి. చేప ముక్కల మీద కొద్దిగా నిమ్మరసం చల్లి సర్వ్‌ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న కొరమీను చేపల వేపుడును సాయంత్రంపూట స్నాక్‌లా వేడిగా తినవచ్చు. సాంబారు లేదా రసం అన్నంలోకి నంజుకొని కూడా తినవచ్చు. ఈ చేపల వేపుడు నాలుగు రోజులపాటు నిల్వ ఉంటుంది.

చిట్కాలు

  • చేప ముక్కలను వేయించేటప్పుడు ఒక్కోదాన్ని జాగ్రత్తగా రెండోవైపునకు తిప్పాలి. లేదంటే అవి విరిగిపోతాయి.

  • నూనె ఎక్కువగా ఉందనిపిస్తే కొద్దిగా తగ్గించుకోవచ్చు. ఉప్పు, కారాలను ఇష్టాన్నిబట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి..

డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి

హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 20 , 2025 | 03:23 AM