DUSU Election Result 2025: డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
ABN , Publish Date - Sep 19 , 2025 | 05:50 PM
ఏబీవీపీ కీలకమైన మూడు పోస్టులు సొంత చేసుకుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఎన్‌ఎస్‌యూఐకి ఒక్క వైస్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే తక్కింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (Dusu) ఎన్నికల్లో ఏబీవీపీ (ABVP) హవా కొనసాగింది. డీయూఎస్‌యూ తదుపరి అధ్యక్షుడిగా ఎబీవీపీ అభ్యర్థి ఆర్యన్ మాన్ (Aryan Mann) గెలుపొందారు. ఆర్యన్‌కు 28,841 ఓట్లు రాగా, ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ అభ్యర్థి జె నందిత చౌదరికి 12,645 ఓట్లు వచ్చాయి. ఏబీవీపీ కీలకమైన మూడు పోస్టులు సొంత చేసుకుంది. అధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఎన్‌ఎస్‌యూఐకి ఒక్క వైస్ ప్రెసిడెంట్ పదవి మాత్రమే తక్కింది. రాహుల్ ఝాంసలా ఈ పదవిని దక్కించుకున్నారు.
తొలి అధ్యక్షుడు ఎవరంటే..
డీయూఎస్‌యూకు తొలి ప్రెసిడెంట్‌గా 1954లో గిరిరాజ్ బహదుర్ నగర్ ఎన్నికయ్యారు. 1955 వరకూ కొనసాగారు. డీయూ నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పొందారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి 1977లో ఫరీదాబాద్‌లోని మేవ్లా మహరాజ్‌పూర్ అసెంబ్లీ నియోజవకర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత హర్యానా కేబినెట్‌లో ఫుడ్ అండ్ సప్లయిస్ మంత్రిగా పనిచేశారు.
తొలి మహిళా అధ్యక్షురాలిగా..
డీయూ తొలి మహిళా అధ్యక్షురాలిగా అంజు సచ్‌దేవ 1989లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పలువురు మహిళలు డీయూ అధ్యక్షులుగా పనిచేశారు. చివరిసారిగా 2008లో నూపుర్ శర్మ డీయూఎస్‌యూ మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కాగా, గత ఏడాది జరిగిన డీయూఎస్‌యూ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన ఎన్‌ఎస్‌యూఐ కీలకమైన ప్రెసిడెట్, జాయింట్ సెక్రటరీ పదవులను గెలుచుకుంది. ఏవీవీపీ ఉపాధ్యక్షుడు, సెక్రటరీ పోస్టులు దక్కించుకుంది.
అమిత్‌షా అభినందనలు
ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయంపై కౌన్సిల్స్ వర్గర్లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభినందలు తెలిపారు. నేషన్ ఫస్ట్ ఐడియాలజీపై యువతకు ఉన్న చెక్కుచెదరని విశ్వాసాన్ని ఈ విజయం ప్రతిబింబించిందని అన్నారు. ఈ విజయంతో కౌన్సిల్స్ స్టూడెంట్స్ శక్తి జాతీయ శక్తిగా ఎదిగేందుకు మరింత మార్గం సుగమమైందని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
పాక్ వెళ్లినప్పుడు సొంత ఇంట్లో ఉన్నట్టుంది.. శామ్ పిట్రోటా వ్యాఖలపై బీజేపీ గరంగరం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి